Cobra Movie: విక్రమ్ మోస్ట్ అవేటెడ్ మూవీ వచ్చేస్తోంది.. ‘కోబ్రా’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
Cobra Movie: కోలీవుడ్ స్టార్ హీరోల్లో నటుడు విక్రమ్ ఒకరు. విభిన్న కథాంశ చిత్రాల్లో, వెరైటీ రోల్స్‌లో నటించే విక్రమ్‌కు తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులున్నారు...
Cobra Movie: కోలీవుడ్ స్టార్ హీరోల్లో నటుడు విక్రమ్ ఒకరు. విభిన్న కథాంశ చిత్రాల్లో, వెరైటీ రోల్స్‌లో నటించే విక్రమ్‌కు తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులున్నారు. ఇక విక్రమ్ తాజాగా నటించిన చిత్రం ‘కోబ్రా’. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్‌కు జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఎట్టకేలకు సినిమా తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. కోబ్రా చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
He’s like a #COBRA!! His strike will be felt even before he arrives ?#CobraFromAugust11 ?#ChiyaanVikram ❤️?
An @AjayGnanamuthu Film? An @arrahman Musical?@IrfanPathan @SrinidhiShetty7 @dop_harish @theedittable @mirnaliniravi @dhilipaction @SonyMusicSouth @proyuvraaj pic.twitter.com/KmV6hXT15y
— Seven Screen Studio (@7screenstudio) June 23, 2022
ఇదిలా ఉంటే గతంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారన్న చర్చ కూడా జరిగింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన క్లారిటీతో ఈ వార్తలకు చెక్ పడినట్లైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలవుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..