AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vijay Sethupathi: కత్తితో కేక్ కట్ చేసిన తమిళ స్టార్ హీరో.. నెటిజన్లకు క్షమాపణలు చెప్పిన విజయ్..

ఇటీవల విడుదల 'మాస్టర్' సినిమా సూపర్ హీట్‏గా దూసుకుపోతుంది. ఇందులో కీలక పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు.

Actor Vijay Sethupathi: కత్తితో కేక్ కట్ చేసిన తమిళ స్టార్ హీరో.. నెటిజన్లకు క్షమాపణలు చెప్పిన విజయ్..
Rajitha Chanti
|

Updated on: Jan 16, 2021 | 2:52 PM

Share

ఇటీవల విడుదల ‘మాస్టర్’ సినిమా సూపర్ హీట్‏గా దూసుకుపోతుంది. ఇందులో కీలక పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన విషయం తెలిసిందే. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఈ హీరో. తాజాగా విజయ్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. చివరకు వారికి క్షమాపణలు కూడా చెప్పాడు. అసలు విషయం ఎంటంటే.. జనవరి 16 విజయ్ సేతుపతి పుట్టిన రోజు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పొన్రామ్ తన టీంతో కలిసి విజయ్ కోసం కేక్ తీసుకొని వచ్చారు. అయితే పుట్టిన రోజు వేడుకలను కాస్తా వెరైటీగా చేయాలని భావించి కత్తితో కేక్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకేముందు నెటిజన్లు విజయ్‏ను ట్రోల్ చేస్తున్నారు. గతంలో చెన్నైలో స్థానిక గుండాలు కత్తితో కేక్ కట్ చేసినందుకు వారిని అరెస్ట్ చేశారు. మరీ విజయ్ కూడా అదే చేశారు. ఆయనను అరెస్ట్ చేస్తారా అంటు కామెంట్లు చేస్తున్నారు. దీంతో విజయ్ వారికి క్షమాపణలు చెప్పారు.

“నా పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు చెప్పిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తునా్నారు. నా పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటో వివాదాస్పదం అవుతుంది. ఇందులో నేను కత్తితో కేక్ కట్ చేశాను. అయితే నేను పొన్రామ్ చిత్రంలో నటించనున్నాను. ఆ సినిమాలో కత్తి కీలక పాత్రలో ఉండనుంది. అందుకే నా పుట్టిన రోజును పొన్రామ్ మరియు చిత్రయూనిట్‏తో కలిసి జరుపుకున్నాను. అందులో భాగంగానే నేను కత్తితో కేక్ కట్ చేశాను. దీనివలన నేను తప్పుడు సంకేతాలు పంపానని అనుకుంటున్నారు. ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటాను. ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన పనికి చింతిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

Also Read: Bigg Boss 4: హౌజ్‌లో అఖిల్‌ బర్త్‌డే వేడుకలు.. ముద్దులతో ముంచెత్తిన మోనాల్