‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్.. ప్రేమంటే ఏంటంటే..!

విజయ్ దేవరకొండ హీరోగా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ తెరకెక్కించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టీజర్ ఇవాళ విడుదలైంది. ఇందులో నాలుగు పాత్రలకు సంబంధించిన ఎలివేషన్లను రివీల్ చేశారు. టీజర్‌లో అక్కడక్కడా కాస్త అర్జున్ రెడ్డి పోలికలు కనిపిస్తున్నా..ఏదో కొత్తదనంతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. గోపి సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ కూడా టీజర్‌కు మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:59 pm, Fri, 3 January 20
'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్.. ప్రేమంటే ఏంటంటే..!

విజయ్ దేవరకొండ హీరోగా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ తెరకెక్కించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టీజర్ ఇవాళ విడుదలైంది. ఇందులో నాలుగు పాత్రలకు సంబంధించిన ఎలివేషన్లను రివీల్ చేశారు. టీజర్‌లో అక్కడక్కడా కాస్త అర్జున్ రెడ్డి పోలికలు కనిపిస్తున్నా..ఏదో కొత్తదనంతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. గోపి సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ కూడా టీజర్‌కు మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. మొత్తానికి ఇప్పటికే పోస్టర్లతో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన విజయ్ దేవరకొండ.. టీజర్‌తో అంచనాలను మరింత పెంచేశాడు.

కాగా రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె లైట్ నటించారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఏ వల్లభ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.