AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranabali Movie: రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్.. సీమ వాసుల అభిమానానికి విజయ్ కృతజ్ఞతలు..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రణబాలి’. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది.

Ranabali Movie: రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్.. సీమ వాసుల అభిమానానికి విజయ్ కృతజ్ఞతలు..
Ranabali Movie
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2026 | 12:23 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రణబాలి. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. నిజానికి ఈ క్రేజీ కాంబోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ అవుతుండడంతో రణబాలి చిత్రంపై మంచి హైప్ ఏర్పడింది. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఏందయ్యా సామీ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అనంతపూర్ లో షూటింగ్ సందర్భంగా అక్కడి స్థానికులు, రౌడీ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అభిమానులు బైక్ ర్యాలీలతో విజయ్ పట్ల ప్రేమను చాటుకున్నారు. విజయ్ దేవరకొండ తన రాయలసీమ అభిమానులను ఫ్యాన్స్ మీట్ లో కలుసుకున్నారు. రాయలసీమకు ఎప్పుడు షూటింగ్ కు వచ్చినా తన సొంతూరుకు వచ్చినట్లు అనిపిస్తుందని, తనలోపల సీమ ఫీల్ ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. ఇలా ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్ తో “రణబాలి” అనంతపూర్ షెడ్యూల్ పూర్తయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ సినిమాలో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us
ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్‌గా పీఎస్ఎల్.. నఖ్వీ కామెంట్స్
ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్‌గా పీఎస్ఎల్.. నఖ్వీ కామెంట్స్
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?