‘ఎఫ్‌ 3’ సెట్స్‌పైకి వెళ్లేందుకు డేట్ ఫిక్స్‌.. రెడీగా ఉన్న వెంకీ, వరుణ్‌

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2న సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 3 పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

'ఎఫ్‌ 3' సెట్స్‌పైకి వెళ్లేందుకు డేట్ ఫిక్స్‌.. రెడీగా ఉన్న వెంకీ, వరుణ్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 15, 2020 | 2:17 PM

F3 movie shooting: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2న సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 3 పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎఫ్‌ 2లో నటించిన వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహ్రీన్‌.. ఈ సీక్వెల్‌లోనూ నటించనున్నారు. వారితో పాటు మరికొందరు ఇందులో భాగం కాబోతున్నారు. (రామ్‌ చరణ్‌కి పెద్ద అభిమానిని.. ఆయన సినిమాలన్నీ చూశా.. ‘ఉప్పెన’ బ్యూటీ)

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించేందుకు డేట్‌ ఫిక్స్ అయ్యిందట. డిసెంబర్ 14న ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్‌. దీనికి సంబంధించిన వెంకటేష్‌, వరుణ్‌లు డేట్లు ఇచ్చేసినట్లు కూడా సమాచారం. ఇక దిల్‌ రాజు నిర్మించనున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. (ముగిసిన మరో శకం.. ప్రముఖ నటుడు, ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత)

కాగా గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్‌ 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ ఇటీవల ఇండియన్ పనోరమ అవార్డును కూడా సొంతం చేసుకుంది. (అమ్మ చీరతో పిల్లలకు డ్రెస్‌లు కుట్టించిన హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌)