#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?

ఫన్ ఎలిమెంట్స్, టాస్కుల విషయం గురించి పక్కన పెడితే.. గత బిగ్ బాస్ సీజన్ల కంటే ఈ నాలుగో సీజన్ కాస్త భిన్నమని చెప్పాలి. పకడ్బందీ స్క్రిప్ట్‌తో..

#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 15, 2020 | 2:42 PM

Bigg Boss 4: ఫన్ ఎలిమెంట్స్, టాస్కుల విషయం గురించి పక్కన పెడితే.. గత బిగ్ బాస్ సీజన్ల కంటే ఈ నాలుగో సీజన్ కాస్త భిన్నమని చెప్పాలి. పకడ్బందీ స్క్రిప్ట్‌తో పాటు జాగ్రత్తలు లాంటి అసలు కనిపించట్లేదు. ప్రతీ వీకెండ్‌లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంతట్ల దగ్గర నుంచి వచ్చే గెస్టులు, హౌస్‌లో జరిగే టాస్క్‌లు ఇలా అనేక విషయాలు ముందుగానే సోషల్ మీడియాలో లీకవుతున్నాయి. పైగా ప్రేక్షకుల ఓట్లకు ఈ సీజన్‌లో అసలు విలువ లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక దేవి నాగవల్లి, కుమార్ సాయి, దివి ఎలిమినేషన్స్ సరికాదని.. మోనాల్, మెహబూబ్ లాంటి వాళ్లు ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి ఉండాలని నెటిజన్లు అంటున్నారు.

ఇక తాజాగా టాప్ 5 కంటెస్టెంట్ల లిస్టుతో పాటు విన్నర్, రన్నరప్ వివరాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇంట్లో ఉన్నది 9 మంది కంటెస్టెంట్స్.. ఇందులో అభిజిత్, అఖిల్, సోహైల్, అవినాష్, లాస్య స్ట్రాంగ్‌గా ఉండగా.. మెహబూబ్, అరియానా, మోనాల్, హారికలు కాస్త వీక్‌గా ఉన్నారు. ఇక వీరిలో మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

దీనితో టాప్ 5లో అభిజిత్, అఖిల్, అవినాష్, సోహైల్, లాస్యలు ఉంటారని.. ఫైనల్ 2లో అయితే అభిజిత్, లాస్యలు ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇక చివరిగా అభిజిత్‌ బిగ్ బాస్ విన్నర్‌గా నిలుస్తాడని తెలుస్తోంది. కాగా, గత సీజన్లలో కూడా అబ్బాయిలే విన్నర్స్ అయ్యారు. తొలి సీజన్‌లో శివబాలాజీ, రెండో సీజన్‌లో కౌశల్.. మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు. ఈ సీజన్‌లోనైనా అమ్మాయి విన్నర్‌గా నిలుస్తుందని అనుకుంటే.. అదేం లేదు అభిజిత్‌కే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. మరి లీకైన లిస్టు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: ‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..