AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెనక్కు తగ్గిన ‘నారప్ప’ టీం.. ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తున్నాం అంటూ ట్వీట్..

Narappa Movie Update: విక్టరి వెంకటేష్ ప్రధాన పాత్రలో... డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న సినిమా నారప్ప.

వెనక్కు తగ్గిన 'నారప్ప' టీం.. ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తున్నాం అంటూ ట్వీట్..
Narappa
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2021 | 2:16 PM

Share

Narappa Movie Update: విక్టరి వెంకటేష్ ప్రధాన పాత్రలో… డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న సినిమా నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రోడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని మే 14న రిలీజ్‌కి రెడీ అయింది. అయితే అనుకోని విధంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ మహమ్మారి బారిన పడగా.. షూటింగ్స్ నిలిచిపోయాయి. అలాగే పలు బారీ బడ్జెట్ చిత్రాలు సైతం విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి వెంకటేష్ సినిమా నారప్ప కూడా వచ్చి చేరింది. ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా అ అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు వెంకటేష్.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాను వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడ్డాక అతిత్వరలో చిత్రాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. ‘అందరం మాస్కులు ధరించి, బౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండటమే మనం సమాజానికి చేసే గొప్ప సాయం అంటూ ట్వీట్ చేశారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ట్వీట్..

Also Read: Cowin Server: కోవిన్ సర్వర్ డౌన్.. ప్రారంభం కాగానే క్రాష్ అయిన వెబ్‏సైట్.. రిజిస్ట్రేషన్‏కు అడ్డంకులు..

ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..

ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు