AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ

ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తఫాను తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు లేఖలో పేర్కొన్నారు. త్వరితగతిన తుఫాను నష్టంపై అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని ఈ మేరకు సీఎం చంద్రబాబు లేఖలో కోరారు.

CM Chandrababu: ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ
Cm Naidu Urges Amit Shah For Ap Cyclone Arnab Damage Assessment
Anand T
|

Updated on: Oct 28, 2026 | 1:27 PM

Share

ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో తుఫాన్ తీవ్రత కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఈ మేరకు తుఫాన్ నేపథ్యంలో చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. తుఫాను సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను నియమించినట్టు స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదన్నారు.

ప్రాథమిక అంచనా ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని సీఎం తెలిపారు. తీర ప్రాంతాల్లో చాలా చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని.. భారీ వర్షాల కారణంగా ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంటకు నీట మునిగినట్టు లేఖలో తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకూ 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోనేలా కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్‌ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజలకు సహాయ చర్యలు, విద్యుత్‌, తాగునీటి పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని లేఖలో రాసుకొచ్చారు. తుఫాను నష్టంపై సమగ్ర అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.

తుపాను సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర మంత్రి అమిత్‌షాను కోరిరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు నిరంతర సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు సీఎం చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్‌.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్‌.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ధంతేరస్ నాడు కుబేరుడిని ఎందుకు పూజిస్తారు? సంపదకు అధిపతి కావడం..
ధంతేరస్ నాడు కుబేరుడిని ఎందుకు పూజిస్తారు? సంపదకు అధిపతి కావడం..
కర్వాచౌత్‌లో చంద్రుడిలా మెరిసిపోవాలా? ఇంట్లోనే గోల్డెన్ గ్లో ఫేస్
కర్వాచౌత్‌లో చంద్రుడిలా మెరిసిపోవాలా? ఇంట్లోనే గోల్డెన్ గ్లో ఫేస్
ప్రోటీన్ నుంచి విటమిన్ బి12 వరకు.. పోషకాల పవర్‌హౌస్ మేక తలకాయ..
ప్రోటీన్ నుంచి విటమిన్ బి12 వరకు.. పోషకాల పవర్‌హౌస్ మేక తలకాయ..
రూ. 449 కోట్లకు అమ్ముడైన అరుదైన డైనోసార్ అస్థిపంజరం జోడి..స్పెషల్
రూ. 449 కోట్లకు అమ్ముడైన అరుదైన డైనోసార్ అస్థిపంజరం జోడి..స్పెషల్
జున్నుపాలు లేకుండా 15 నిమిషాల్లో చేసే గడ్డలాంటి జున్నును
జున్నుపాలు లేకుండా 15 నిమిషాల్లో చేసే గడ్డలాంటి జున్నును
దీపావళికి ఇంట్లో ఈ మొక్కలు నాటితే..లక్ష్మీదేవి పరుగెత్తుకవస్తుంది
దీపావళికి ఇంట్లో ఈ మొక్కలు నాటితే..లక్ష్మీదేవి పరుగెత్తుకవస్తుంది
ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి నేతాజీ మనవడి లేఖ.!
ప్రభాస్ ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి నేతాజీ మనవడి లేఖ.!
మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు
మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు
శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇచ్చే మినప పొట్టు వడియాలు.. 
శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇచ్చే మినప పొట్టు వడియాలు..