Matka: ‘వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడిని కాదు’.. మట్కా ట్రైలర్‌ చూశారా.?

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మట్కా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. నవంబర్ 14వ తేదీన మట్కా విడుదలవుతుండగా వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. మరి మట్కా ట్రైలర్ ఎలా ఉందో మీరూ చూసేయండి...

Matka: 'వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడిని కాదు'.. మట్కా ట్రైలర్‌ చూశారా.?
Matka
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 02, 2024 | 2:52 PM

వరుణ్‌ తేజ్‌ హీరోగా హీరోగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం మట్కా. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 1960-80ల మధ్య జరిగిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా వచ్చిన టీజర్‌, ఫస్ట్‌లుక్స్‌ మూవీపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ సినిమాను నవంబర్‌ 14వ తేదీన తీసుకొచ్చేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 2.48 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీ ఓ రేంజ్‌లో పెంచేసింది.

ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ తనలోని కొత్త యాంగిల్‌ను చూపించినట్లు స్పష్టమవుతోంది. వరుణ్‌ ఈసారి మంచి కంటెంట్‌ ఉన్న సబ్జెక్ట్‌తో వస్తున్నారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. వరుణ్‌ నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఓ సాధారణ వ్యక్తి గ్లాంబింగ్‌ రంగంలోకి వచ్చాడు.? ఈ క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి ఏమయ్యాడు.? అన్న ఆసక్తికర విషయాలను ఇందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

మట్కా ట్రైలర్..

ఇక యాక్షన్‌ సన్నివేశాలు తెగ ఆట్టుకుంటున్నాయి. అలాగే ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్‌ మెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ‘వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడిని కాదు. వాసుని మట్కా కింగుని’, ‘నీలాంటి మంచోళ్ల వల్ల టైమ్‌కి వర్షాలు పడుతున్నాయి. పంటలు పండుతున్నాయి. కానీ నాలాంటి చెడ్డోళ్ల వల్ల ఓ పదిమంది కడుపులు నిండుతున్నాయి. నేచర్‌ బ్యాలెన్స్‌’, ‘వ్యసనంలో పతనం ఉంటుంది’ అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద ట్రైలర్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ను తీసుకొస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!