vamshi paidipally: మెగాస్టార్ చిరంజీవితో మహర్షి డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన వంశి పైడిపల్లి ఆతర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

vamshi paidipally: మెగాస్టార్ చిరంజీవితో మహర్షి డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడా..?
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 20, 2021 | 7:53 AM

vamshi paidipally: సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన వంశి పైడిపల్లి ఆతర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆమధ్య మహేష్ తోనే మరో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే స్టోరీని మహేష్ కోసం వంశీ సిద్ధం చేసారని టాక్ నడిచింది. కానీ ఆ సినిమా ఎందుకో కార్య రూపం దాల్చలేదు. ఆతర్వాత ప్రభాస్, రామ్ చరణ్ లతో సినిమా చేయాలనీ వంశీ పరాయత్నించారని కథలు కూడా వినిపించారని ప్రచారం జరిగింది. ఇక నాగార్జున లాంటి సీనియర్ హీరోకు కూడా ఊపిరి వంటి సలుపర్ హిట్ ను అందించాడు వంశీ. తాజాగా ఈ డైరెక్టర్ మరో పెద్ద హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. అతిపెద్ద హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. రీసెంట్ గా చిరంజీవిని కలిసి ఒక కథను వినిపించినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఈ కథపైనే కసరత్తు చేస్తూ వచ్చిన వంశీ పైడిపల్లి, కథ బాగా వచ్చిందన్న నమ్మకం కుదిరిన తరువాతనే చిరంజీవికి చెప్పాడట. చిరంజీవి నుంచి సమాధానం రావలసి ఉందని అంటున్నారు.మరి మెగాస్టార్ మహర్షి డైరెక్టర్ కు ఓకే చెప్తారేమో చూడాలి. మరో వైపు మహర్షి సినిమా ఇప్పటికి రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. ఇటీవలే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా .. టీవీలో టెలికాస్ట్ అవుతూ రికార్డు స్థాయి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bollywood Celebrities: జీవిత పరమార్ధం తెలిసిందంటూ సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటీమణులు .. ఎవరో తెలుసా

Sameera Reddy: నాతో పాటు నా పిల్లలకు కూడా కరోనా బారిన పడ్డారు.. జాగ్రత్తగా ఉండమంటూ ఎమోషనల్ పోస్ట్

స్జేజ్ పై డ్యాన్స్ చేస్తూ కింద పడ్డ ప్రముఖ సింగర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..