పుష్ప సినిమాలో యాక్షన్ సీన్లే హైలైట్ గా ఉండనున్నాయట.. ఫైట్స్ కోసం ఏకంగా అంత ఖర్చు చేస్తున్నారా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజాగా చిత్రం 'పుష్ప'. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లక్కీ గర్ల్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజాగా చిత్రం ‘పుష్ప’. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లక్కీ గర్ల్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన బన్నీ లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఉరమాస్ లుక్ లో బన్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్ బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ కు అనూహ్య రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో బన్నీ లుక్స్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు ఈ సినిమా రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్ లుకూడా ఉన్నాయట. ఇదిలా ఉంటె ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుత పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మాత్రమే 39 కోట్ల రూపాయలను కేటాయించారని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి ఈ సినిమాలో ఎంతటి భారీ ఫైట్లు .. రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల్ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. దేవీశ్రీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఆగస్టు 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
రవితేజ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడిన మాస్ మాహరాజా మూవీ.. తిరిగి ఎప్పుడు ప్రారంభమంటే..
Mahesh Babu: మరో రికార్డ్ ను క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా…..
Rashmika Mandanna: జర్నలిస్ట్‌గా చేయబోతున్న రష్మిక… చెర్రీ, శంకర్ సినిమాలో నటించే ఛాన్స్… ( వీడియో )