AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK: తన అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. సంచలనం సృష్టిస్తోన్న అన్‌స్టాపబుల్ ప్రోమో..

ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సీజన్‌ 4 ప్రారంభానికి సిద్ధమైంది. తొలి ఎపిసోడ్‌ ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతోంది..

Unstoppable with NBK: తన అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు.. సంచలనం సృష్టిస్తోన్న అన్‌స్టాపబుల్ ప్రోమో..
Unstoppable With Nbk
Narender Vaitla
|

Updated on: Oct 22, 2024 | 1:44 PM

Share

నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న టాక్‌ షో అన్‌స్టాపబుల్ సీజన్‌ 4 ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి ఎసిపోడ్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు. అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుత తెగ వైరల్‌ అవుతోంది. ‘మా బావగారు.. మీ బాబు గారు’ అంటూ బాలయ్య ఇచ్చిన ఇంట్రోతో ఆకట్టుకుంటోంది. ఇక షోలో అన్ని నిజాలే మాట్లాడుతానని బాలయ్య బాబు.. చంద్రబాబుతో ప్రమాణం చేశాయించారు. అయితే సమయస్ఫూర్తితో సమాధానం చెప్తానంటూ చంద్రబాబు చమత్కరించారు. అరెస్టు నుంచి తాజా రాజకీయాల వరకూ.. జైలు జీవితం గురించి ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ షోలో చంద్రబాబు పంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అరెస్ట్‌ గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఒకింత ఎమోషన్‌కు గురయ్యారు.

మొదటి రాత్రి జైలులో ఎలా గడిచిందో చెప్తూ ఉద్వేగానికి గురయ్యారు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టబోమని చంద్రబాబు అన్నారు. జైలు గోడల మధ్య బాబు-పవన్‌ మధ్య ఏం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నూతన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక థింక్‌ గ్లోబలీ.. యాక్ట్ గ్లోబలీ తన స్లోగన్‌తో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం మీద ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రపంచానికి తెలిసే అవకాశాలు ఉన్నాయని ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!