వివాదంలో చిరంజీవి ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్,‌

వివాదంలో చిరంజీవి 'ఆచార్య'
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 25, 2020 | 9:05 AM

Chiranjeevi Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్,‌ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది‌ మెగా ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకోగా, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు వివాదం మొదలైంది. చిరంజీవి మోషన్ పోస్టర్‌ని తన కథ నుంచి కాపీ కొట్టారంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఆరోపిస్తున్నారు.

పుణ్యభూమి అనే టైటిల్‌తో 2006లో తాను ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించానని.. ఆచార్య మోషన్ పోస్టర్‌లో ధర్మస్థలి అనే ఎపిసోడ్‌ తన స్క్రిప్ట్‌ నుంచి తీసుకునన్నారని అనిల్ కృష్ణ వెల్లడించారు. మరి దీనిపై ఆచార్య టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా కొరటాల గతంలో మహేష్ బాబుతో తెరకెక్కించిన శ్రీమంతుడు మూవీకి కూడా కాపీ మరకలు అంటాయి. దీనిపై ఓ రచయిత కోర్టును కూడా ఆశ్రయించారు.

కాగా ఆచార్యలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోనూసూద్‌, అజయ్‌, హిమజ తదితరులు పలు పాత్రల్లో నటించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,579 కొత్త కేసులు.. 9 మరణాలు

పెళ్లి వార్తలు.. కొరటాలకు ఫోన్ చేసిన కాజల్‌!