Actress Trisha: ఆరోజున ఓటీటీలో రిలీజ్ కానున్న హీరోయిన్ త్రిష సినిమా.. తెలుగులో వెర్షన్లో కూడా..
లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తిరిగి తెరుచుకున్నా కానీ.. ఓటీటీ సంస్థల జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందిస్తూ.. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి.
లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తిరిగి తెరుచుకున్నా కానీ.. ఓటీటీ సంస్థల జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందిస్తూ.. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. ఇక థియేటర్లలో విడుదలై మంచి హిట్ సాధించిన సినిమాలు కూడా మళ్లీ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా సినిమాలను సొంతం చేసుకువడానికి బడ్జెట్ విషయంలో కూడా ఓటీటీ సంస్థలు వెనకడుగు వేయడం లేదు. తెలుగులో క్రాక్, మాస్టర్ వంటి సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సినిమా కూడా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
పిజ్జా 2 థ్రిల్లర్ మూవీని తొలిసారిగా విడుదల చేసిన ఫిలిం ఓటీటీ తాజాగా.. త్రిష మూవీని విడుదల చేయనున్నారు. 2018లో మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న “హే జూడ్” సినిమాను త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా సమాచారం. ఇందులో మలయాళ నటుడు నివిన్ పాలీ, త్రిష హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. హే జూడ్ చిత్రాన్ని ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు.
Also Read:
Pagal Movie Update: విశ్వక్ సేన్ ‘పాగల్’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..