Jr NTR: స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్‌లో యంగ్ టైగర్ సినిమా.. అథ్లెటిక్‌గా కనిపించనున్న తారక్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినీ ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమాలో తారక్ కొమురం భీంగానటిస్తున్న విషయం తెలిసిందే.

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినీ ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమాలో తారక్ కొమురం భీంగానటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు , ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ కూడా వాయిదా పడుతుంది. జనవరి 7న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడి సమ్మర్ కు షిఫ్ట్ అయ్యింది. ఈ సినిమాను మర్చి 25 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ భావిస్తోస్తుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇప్పటికే కొరటాలతో ఓ సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఆచార్య సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆచార్య చివరి దశకు చేరుకోవడం, ఎన్టీఆర్ కూడా ఖాళీగా ఉండడంతో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై అడుగులు ముందుకు పడ్డాయి.
ఇదిలా ఉంటే తరలక్ ఉప్పెన దర్శకుడు బిచ్చిబాబు తో సినిమా చేస్తున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త తాజాగా బయటికి వచ్చింది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఉండనుందని అంటున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ అథ్లెట్ గా కనిపిస్తారని పారా ఒలిపింక్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి భిన్నంగా కనిపిస్తారని అంటున్నారు. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ కోసం లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ . ఆర్ . రెహమాన్ సంప్రదిస్తున్నారట.
మరిన్ని ఇక్కడ చదవండి :




