Katha Kanchiki Manam Intiki: కథ కంచికి మనం ఇంటికి ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్.. ఆకట్టుకుంటున్న హారర్ కామెడీ..
డియర్ మేఘ ఫేమ్ యంగ్ హీరో త్రిగుణ్ (Trigun) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కథ కంచికి మనం ఇంటికి (Katha Kanchiki Manam Intiki). ఇందులో త్రిగుణ్ సరసన పూజిత పొన్నాడ హీరోయిన్గా నటిస్తోంది.

డియర్ మేఘ ఫేమ్ యంగ్ హీరో త్రిగుణ్ (Trigun) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కథ కంచికి మనం ఇంటికి (Katha Kanchiki Manam Intiki). ఇందులో త్రిగుణ్ సరసన పూజిత పొన్నాడ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత మోనిష్ పత్తిపాటి నిర్మిస్తుంది. చాణిక్య చిన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది.
హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది ట్రైలర్. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కథ కంచికి మనం ఇంటికి.. మార్చ్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..
‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా’.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్ విన్నారా.?
Keerthy Suresh: సూపర్ స్టైలీష్ లుక్‌లోఫ్యాన్స్ గుండెలను కొల్లగొడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్
Ashu Reddy: లంగా వోణీ రచ్చ చేస్తున్న అషు రెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్




