Boney Kapoor: తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్.. క్లారిటీ ఇచ్చేసిన బోనీ కపూర్..
అతిలోక సుందరి.. అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ (Janhvi Kapoor ) ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. దడక్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ..
అతిలోక సుందరి.. అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ (Janhvi Kapoor ) ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. దడక్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో జాన్వీ.. నటన పరంగా సినీ విశ్లేషకుల నుంటి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత జాన్వీ బీటౌన్‌లో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‍లో బిజీ హీరోయిన్గా ఉన్న జాన్వీ సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఈ క్రమంలోనే అలనాటి హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా టాలీవుడ్లోకి జాన్వీ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తెలుగులో జాన్వీని పరిచయం చేసేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ నడిచింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
తాజాగా జాన్వీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై ఆమె తండ్రి నిర్మాత బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు. తమిళ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం వలిమై. భారీ బడ్జెట్ తో బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 24న విడుదల కానుంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వలీమై ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పాల్గోన్న బోనీ కపూర్ జాన్వీ తెలుగు సినిమా ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘నేను బాలీవుడ్ నిర్మాతనే అయినా నా మనసెప్పుడూ దక్షిణాాది సినమాలపైనే ఉంటుంది. బాపుగారు డైరెక్ట్ చేసిన మనవూరి పాండవులు సినిమాను హిందీలో హమ్ హై పాంచ్ అనే పేరుతో రీమేక్ చేశాను. అలా తెలుగు సినిమాను రీమేక్ చేయడం ద్వారానే నా కెరీర్‌ను ప్రారంభించాను. బాపుగారు దర్శకుడిగా నాకెన్నో కొత్త విషయాలను నేర్పించారు. కాదల్ కోటై, వాలి సినిమాల నుంచి అజిత్‌గారితో మంచి అనుబంధం ఉంది. కాదల్ కోటై చిత్రాన్ని హిందీలో నేనే రీమేక్ చేశాను. ఇక అజిత్‌తో మూడు సినిమాలు చేసే అవకాశం దక్కింది. మూడో సినిమాను కూడా వినోద్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సినిమాను కూడా చేస్తాం. అజిత్, వినోద్ ఇద్దరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఫోకస్‌గా ఉంటారు. వారు ఎంటైర్ టీమ్‌ను ముందుకు నడిపించారు. అద్భుతమైన జర్నీ. ఈ జర్నీ ఇంకా కొనసాగనుంది. ఇక కార్తికేయ చూడటానికి సింపుల్‌గా, కూల్‌గా కనిపిస్తున్నాడు కానీ.. స్క్రీన్‌పై బబ్బర్ షేర్‌లా యాక్ట్ చేశాడు. తనను చూస్తే భయపడతాం అలా నటించాడు. తెలుగులోనూ సినిమాలు చేయాలని ఎదురు చూస్తున్నాను. నా కుమార్తె జాన్వీ కపూర్ తప్పకుండా తెలుగులో సినిమా చేస్తుంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తోంది. తెలుగులోనే కాదు, తమిళం సహా ఇతర దక్షిణాది భాషల్లోనూ ఆమె నటించడానికి సిద్ధంగా ఉంది. పిబ్రవరి 24న రిలీజ్ అయ్యే ‘వలిమై’ సినిమా ఆడియెన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది ’’ అన్నారు.
Also Read: Bheemla Nayak Pre Release Event Live: ఘనంగా ప్రారంభంమైన భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్
Ante Sundaraniki: గండాలు దాటడం కోసం హోమగుండాల చుట్టూ తిరుగుతున్న సుందరం.. పుట్టిన రోజున ఇలా..
Sehari Aha: ఆహాలో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..