Siddhu Jonnalagadda: ఆయన ఓ సూపర్ హ్యూమన్.. ఆయనతో సినిమా కోసం వెయిటింగ్

హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించిన సిద్దూ జొన్నలగడ్డ ఆతర్వాత హీరోగా మారి గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాద లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత 2022లో వచ్చిన డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలంగాణ యాసలో సిద్దు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.

Siddhu Jonnalagadda: ఆయన ఓ సూపర్ హ్యూమన్.. ఆయనతో సినిమా కోసం వెయిటింగ్
Siddhu Jonnalagadda
Follow us

|

Updated on: Apr 01, 2024 | 10:02 AM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ జోరు మాములుగా లేదుగా.. డీజే టిల్లు సినిమాతో యువతను ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి హిట్ కొట్టాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించిన సిద్దూ జొన్నలగడ్డ ఆతర్వాత హీరోగా మారి గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాద లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత 2022లో వచ్చిన డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలంగాణ యాసలో సిద్దు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఆ సినిమాను ఒక్కడే నడిపించాడు సిద్దు. ఆ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

గత శుక్రవారం (మార్చ్ 29)న విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మరోసారి యువతను ఆకట్టుకునే కథతో వచ్చిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. మునుపెన్నడూ కనిపించాలని గ్లామరస్ రోల్ లో కనిపించి మెప్పించింది అనుపమ. ఇదిలా ఉంటే సిద్దు గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సిద్దు జొన్నలగడ్డకు అవకాశం వచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత దాని గురించి ఎక్కడా కూడా యూస్ లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్దు మాట్లాడుతూ దీని పై స్పందించారు. మెగాస్టార్ తో సినిమా చేస్తే అది తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అన్నాడు సిద్దు. గతంలో చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. మళ్లీ ఆ అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నా.. మేము ఎప్పుడైనా కలిసిన దాని గురించే మాట్లాడుకుంటాం.. ఆయన ఓ సూపర్ హ్యూమన్. ఇండస్ట్రీ అంటే ముందు గుర్తుకొచ్చేది మెగాస్టారే అని అన్నాడు సిద్దు. అలాగే వెంకటేష్ తనకు ఆల్‌టైమ్ ఫేవరెట్‌ హీరో అని.. అలాగే నాకు చిరంజీవి, బాలకృష్ణ , అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ ఇలా అందరితో కలిసి నటించాలని ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!