Nikhil Siddhartha: జోరుమీదున్న కుర్ర హీరో.. ఈ ఏడాది రెండు సినిమాలతో రానున్న నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నిఖిల్.
Nikhil Siddhartha: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన నిఖిల్ ఆతర్వాత సోలో హీరోగా ఎదిగాడు. వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకస్థానాన్నీ సంపాదించుకున్నాడు. ఇక ఈ కుర్ర హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఆయా షూటింగ్స్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్రైటింగ్స్ లో నిఖిల్ 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట. అలాగే చెందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 అనే సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో కార్తికేయ సినిమా వచ్చింది. డిఫరెంట్ కనెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి అదే తరహా కథతో చందు మొండేటి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు.
ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ’18 పేజెస్ సినిమా షూటింగ్ మరో 10 .రోజుల్లో పూర్తి కానుందట. అలాగే కార్తికేయ 2 మూవీ కూడా త్వరలోనే పూర్తి చేయనున్నాడట నిఖిల్. ఇక ‘కార్తికేయ 2’లో స్వాతిరెడ్డి కూడా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు నిఖిల్. ఈ సినిమాకు గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్ గా చేసిన గ్యారీ బీహెచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీటితోపాటు మరో రెండు సినిమాలు నిఖిల్ చేతిలో ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :