Raja Vikramarka: ‘రాజా విక్రమార్క’ టైటిల్ పెట్టానని చిరంజీవిగారికి చెప్తే ఏమన్నారంటే..

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన పేరు చెబితే ముందు 'ఆర్ఎక్స్ 100' గుర్తుకు వస్తుంది.

Raja Vikramarka: 'రాజా విక్రమార్క' టైటిల్ పెట్టానని చిరంజీవిగారికి చెప్తే ఏమన్నారంటే..
Raja Vikramarka
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 10, 2021 | 6:40 AM

Raja Vikramarka: యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన పేరు చెబితే ముందు ‘ఆర్ఎక్స్ 100’ గుర్తుకు వస్తుంది. అటువంటి న్యూ ఏజ్ సినిమా చేయడానికి ధైర్యం కావాలి. అది కార్తికేయకు ఉంది కాబట్టే ఆ సినిమా చేశారు. హీరోగా ‘ఆర్ఎక్స్ 100’ వంటి విజయం తర్వాత విల‌న్‌గా నటించడానికి కూడా ధైర్యం కావాలి. ‘గ్యాంగ్ లీడర్’లో స్ట‌యిలిష్‌ విల‌న్‌గా నటించి మెప్పించాడు. ‘చావు కబురు చల్లగా’ వంటి వైవిధ్యమైన సినిమా చేశారు. ‘రాజా విక్ర‌మార్క‌’లో ఎన్ఐఏ ఏజెంట్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా, తాన్యా రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ..

నేను ఇప్పటివరకూ ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇందులో యాక్షన్ కూడా స్ట‌యిలిష్‌గా ఉంటుంది. ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్ర‌స్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను టచ్ చేయని జానర్ సినిమా. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో ఆటు వినోదం కూడా ఉంటుంది. ప్రతి పాత్ర, వినోదం కథలో భాగం గానే ఉంటుంది. మా ’88’ రామారెడ్డి, ఆదిరెడ్డిగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. వాళ్లకు తొలి సినిమా అయినా ఖర్చుకు వెనుకాడలేదు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా.. థియేటర్లలో రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. శ్రీ ముందు ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. ‘రాజా విక్రమార్క’ టైటిల్ సౌండింగ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాజిటివిటీ… చిరంజీవిగారి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు అన్నారు. టైటిల్ పెట్టిన తర్వాత చెప్పాను. ముందు టైటిల్ దొరుకుతుందో? లేదో? అని చెక్ చేశాం. టైటిల్ ఉందని తెలిశాక రిజిస్టర్ చేశా. తర్వాత ఆయనకు పంపించాను. ‘గుడ్ లక్’ అని చెప్పారు. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని ఒక సంతోషం. ఆయన సినిమా టైటిల్స్ అన్నీ ఆయనవే. కొంతమంది అభిమానులు పిల్లలకు తమ అభిమాన హీరో పేరు పెట్టుకుంటారు. అలా అభిమానంతో పెట్టుకున్నాను అన్నారు కార్తికేయ. మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్