AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hidimbha: మరో ఇంట్రస్టింగ్ మూవీతో రానున్న అశ్విన్.. అనిల్ రావిపూడి చేతులమీదుగా ఫస్ట్ గ్లిమ్ప్స్

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తున్న ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు

Hidimbha: మరో ఇంట్రస్టింగ్ మూవీతో రానున్న అశ్విన్.. అనిల్ రావిపూడి చేతులమీదుగా ఫస్ట్ గ్లిమ్ప్స్
Hidimbha
Rajeev Rayala
| Edited By: |

Updated on: May 15, 2022 | 10:05 PM

Share

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు( Ashwin Babu) కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తున్న ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. జీనియస్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. ఆ సినిమా మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జతకలిసే, రాజుగారి గది, రాజుగారి గది 2, రాజుగారి గది 3, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో ఓ ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నాడు అశ్విన్. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిడింబ(Hidimbha)అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమాలో అశ్విన్ సరసన నందిత శ్వేత నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లిమ్ప్స్ ను బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో అశ్విన్, నందిత పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారని గ్లిమ్ప్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ గ్లిమ్ప్స్ లో అశ్విన్ రౌడీలను చితకొట్టడం చూపించారు. ఈ మూవీ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు అశ్విన్. మాస్ హీరోగా ఆయన టర్న్ అవ్వబోతున్నారని ఈ గ్లింప్స్‌తో అర్థమైపోతుంది. కండలు తిరగిన దేహంతో, కోర మీసంతో ఆయన స్టైల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది.  ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని గ్లిమ్ప్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. SVK బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Udhayanidhi Stalin: తమిళ హీరో షాకింగ్‌ నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టాలిన్‌!

Karate Kalyani: కరాటే కళ్యాణిపై మరో కేసు నమోదు.. ఆ విషయంలో బాధితుడు ఫిర్యాదు చేయడంతో..

Akshay Kumar: అక్షయ్‌కుమార్‌కి రెండోసారి కరోనా పాజిటివ్‌.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దూరం..

Follow Us