Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ సర్కారు వారి పాటకు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చిన డార్లింగ్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
రిస్క్ తీసుకోను బ్రదర్! నాలుగేళ్ల నుంచి అన్నీ సూపర్ హిట్టులే.. ఇది కూడా..! అని మేజర్ ట్రైలర్ లాంచ్‌లో కామన్‌గా అన్న మహేష్ మాటలు మరోసారి నిజమయ్యాయి
రిస్క్ తీసుకోను బ్రదర్! నాలుగేళ్ల నుంచి అన్నీ సూపర్ హిట్టులే.. ఇది కూడా..! అని మేజర్ ట్రైలర్ లాంచ్‌లో కామన్‌గా అన్న మహేష్(Mahesh Babu) మాటలు మరోసారి నిజమయ్యాయి. సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata )దిమ్మతిరిగే హిట్ అనే టాక్ ఎట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాబ్లీ బ్యూటీ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోకిరి సినిమా తర్వాత మహేష్ మాస్ యాంగిల్ లో కనిపించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత వచ్చిన ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ నే కాదు.. డార్లింగ్ ప్రభాస్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుందట.
రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ .. సర్కారు వారి పాట సినిమా చూశారట. తన హోమ్ థియేటర్లో స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని మరీ మహేష్ మేజిక్‌ను విట్‌నెస్ చేశారట. అంతేకాదు ప్రిన్స్ డైలాగ్ డెలివరీకి… యాక్షన్ సీన్లకు మెస్మరైజ్ కూడా అయ్యారట డార్లింగ్ ప్రభాస్ . కీర్తి, మహేష్ లవ్ ట్రాక్‌కు పడి పడి నవ్వారట కూడా..! ఓవరాల్ గా సర్కారు వారి పాట సూపర్ డూపర్ హిట్టంటూ.. మహేష్ అండ్ టీంను విష్ కూడా చేశారట. ఇప్పుడిదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్ ను హంగామా చేసేలా చేస్తోంది. ఇటీవలే సీఎం జగన్ ను కలిసేందుకు చిరంజీవి , రాజమోళి తో పాటు మహేష్ , ప్రభాస్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మహేష్, ప్రభాస్ చాలా సరదాగా కనిపించారు. ఇక ఇప్పుడు డార్లింగ్ మహేష్ సినిమా పైప్రశంసలు కురిపించారని వార్తలు వైరల్ అవ్వడంతో ఇద్దరు హీరోలో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :