Udhayanidhi Stalin: తమిళ హీరో షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టాలిన్!
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ నటించిన తాజా నెంజుకు నీధి. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఆర్టికల్ 15కు తమిళ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Udhayanidhi Stalin: ఓకే ఓకే అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్. ఆతర్వాత కూడా పలు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌కు కూడా బాగా చేరువయ్యాడు. ముఖ్యంగా సైకో సినిమాలో అంధుడి పాత్రలో స్టాలిన్ నటన అందరినీ ఆకట్టుకుంది. కాగా ఉదయనిధి స్టాలిన్ నటించిన తాజా నెంజుకు నీధి. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఆర్టికల్ 15కు తమిళ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో మామన్నన్ అనే సినిమాలో నటిస్తున్నాడు స్టాలిన్. కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం చెప్పాడు స్టాలిన్.
అందుకే ఈ నిర్ణయం.. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ తనయుడే ఉదయనిధి స్టాలిన్. తండ్రి బాటలోనే నడుస్తోన్న ఆయన గత ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అప్పుడే సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెబుతాడని వార్తలు వచ్చాయి. అయితే సినిమాలు, రాజకీయాలను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇన్ని రోజుల పాటు వెండితెరపై కనిపించాడు. అయితే ఎక్కువ కాలం పాటు ఇలా చేయలేనని, అందుకే సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు స్టాలిన్ చెప్పుకొచ్చారు. కాగా స్టాలిన్ వారసుడిగా రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే ఉదయనిధి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
True power and strong Will -justice will be served! Bringing the action-packed story of #NenjukuNeedhi on the big screens on 20th May ? #6DaysToGo@ZeeStudios_ @BoneyKapoor @BayViewProjOffl #RomeoPictures @mynameisraahul @RedGiantMovies_ @Arunrajakamaraj @actortanya pic.twitter.com/coh9iLNy0m
— Udhay (@Udhaystalin) May 14, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: