Lakshya vs Ginting Thomas Cup Final: చరిత్ర సృష్టించే దిశగా భారత్.. తొలి విజయం అందించిన లక్ష్య సేన్..
Thomas Cup First Match Report 2022: థామస్ కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుపై లక్ష్య సేన్ భారత్‌కు అవసరమైన ప్రారంభాన్ని అందించాడు.
73 ఏళ్ల తర్వాత తొలిసారి థామస్ కప్ ఫైనల్ ఆడడం చాలా పెద్ద విషయం. దీంతో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. భారత షట్లర్లు బ్యాంకాక్‌లో బాగా రాణిస్తున్నారు. థామస్ కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుపై లక్ష్య సేన్ భారత్‌కు అవసరమైన ఆరంభాన్ని అందించాడు.
1వ మ్యాచ్: లక్ష్య సేన్ విజయం..
లక్ష్య వర్సెస్ ఆంథోనీ మధ్య ఉత్కంఠభరితమైన ఎన్‌కౌంటర్ జరిగింది. తొలి సెట్‌ను 21-8తో ఆంథోనీ కైవసం చేసుకోగా, రెండో సెట్‌ను 21-17తో కైవసం చేసుకున్న లక్ష్య సేన్.. మ్యాచ్‌ను సమం చేశాడు. మూడో సెట్‌ను 21-16తో కైవసం చేసుకుని భారత్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
ఈ టోర్నీలో ఇండోనేషియా అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. ప్రస్తుత టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అజేయంగా నిలచింది. కాగా, గ్రూప్-స్టేజ్‌లో చైనీస్ తైపీపై భారత జట్టు ఏకైక ఓటమిని మాత్రమే చవిచూసింది.
Supersen mode ?@lakshya_sen demoslishes Olympic ? medlist, Perfect start ??#TUC2022#ThomasCup2022#ThomasUberCups#IndiaontheRise#Badminton pic.twitter.com/yvS5W797I3
— BAI Media (@BAI_Media) May 15, 2022