The Warriorr: దూసుకుపోతున్న ఉస్తాద్ రామ్ ‘ది వారియర్’ టీజర్.. అదరగొట్టిన ఎనర్జిటిక్ హీరో

The Warriorr: దూసుకుపోతున్న ఉస్తాద్ రామ్ 'ది వారియర్' టీజర్.. అదరగొట్టిన ఎనర్జిటిక్ హీరో
Ram Pothineni The Warrior

సత్య ఐపీఎస్ పాత్రలో అదరగొట్టాడు రెడీ అయ్యాడు ఉస్తాద్ రామ్ పోతినేని. ఈ ఎనర్జిటిక్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది వారియర్'. ఈ సినిమా  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.

Rajeev Rayala

|

May 15, 2022 | 6:40 PM

సత్య ఐపీఎస్ పాత్రలో అదరగొట్టాడు రెడీ అయ్యాడు ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni). ఈ ఎనర్జిటిక్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్'(The Warriorr). ఈ సినిమా  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. మే 15న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక్కరోజు ముందుగానే సినిమా టీజర్ విడుదల చేశారు వారియర్ టీమ్. ఇప్పుడు టీజర్ దూసుకుపోతోంది. ఇప్పటికే 9 మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఈ టీజర్.

‘ది వారియర్’ టీజర్‌లో హీరో రామ్ క్యారెక్టర్‌తో పాటు విలన్ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ కృతి శెట్టి, నదియా క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ ఫెరోషియస్ యాక్టింగ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అని చెప్పాలి. హీరోను లింగుస్వామి బాగా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉన్నాయి.

యాక్షన్ మాత్రమే కాదు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు టీజర్‌లో చోటు ఇచ్చారు. ‘డిప్యూటీ సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్ సత్య పోరీని నేను’ అని కృతి శెట్టి చెప్పడమే కాదు, రామ్‌తో రొమాన్స్ చేయడమూ చూపించారు. ‘ఆట బానే ఉంది, ఆడేద్దాం’ అంటూ ఆది పినిశెట్టి చెప్పడం, ఆయన గెటప్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి. పాన్ ఇండియా సినిమా చూసుంటారు. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా?’, ‘మై డియర్ గ్యాంగ్‌స్ట‌ర్స్‌ వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్’ అంటూ రామ్ చెప్పే డైలాగులు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.

మాస్.. ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీజర్ చెప్పకనే చెప్పింది. యాక్షన్ ప్రియులను మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని రామ్, నదియా సీన్ చూస్తే అర్థం అయ్యింది. విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ‘ది వారియర్’ టీజర్ వైరల్ అయ్యింది.  నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. స్క్రీన్ మీద రామ్, స్క్రీన్ వెనుక లింగుస్వామి అద్భుతంగా చేశారు. ఊర మాస్ విజువల్ గ్రాండియర్ అని ఆడియన్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. వాళ్ళ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. ఒక్క పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ పాటను ఈ నెల 22 నుంచి హైదరాబాద్‌లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తాం” అని చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Udhayanidhi Stalin: తమిళ హీరో షాకింగ్‌ నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టాలిన్‌!

Karate Kalyani: కరాటే కళ్యాణిపై మరో కేసు నమోదు.. ఆ విషయంలో బాధితుడు ఫిర్యాదు చేయడంతో..

Akshay Kumar: అక్షయ్‌కుమార్‌కి రెండోసారి కరోనా పాజిటివ్‌.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దూరం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu