AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. డబ్బింగ్ పనుల్లో బిజీ బిజీ అడవి శేష్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మేజర్..

'మేజర్' చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడవి శేష్ పోషిస్తున్న విషయం తెలిసిందే. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న‌ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు హిందీలో భాష‌ల‌లో రూపొందుతోంది.

Adivi Sesh: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. డబ్బింగ్ పనుల్లో బిజీ బిజీ అడవి శేష్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మేజర్..
Shesh
Rajeev Rayala
|

Updated on: Jan 02, 2022 | 8:02 AM

Share

Adivi Sesh: ‘మేజర్’ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడవి శేష్ పోషిస్తున్న విషయం తెలిసిందే. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న‌ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు హిందీలో భాష‌ల‌లో రూపొందుతోంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌కి ప్రామాణికత ఇవ్వడానికి, శేష్ ఈ చిత్రానికి హిందీలో కూడా డబ్బింగ్ చెబుతున్నారు ఇప్పటికే హిందీ వెర్షన్‌కి డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేజ‌ర్ మూవీ హిందీ డ‌బ్బింగ్ మొద‌లుపెట్టాను.. 2022ను ఘ‌నంగా ప్రారంభించుదాం“ అని ట్వీట్ చేశాడు అడవి శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం, యుక్తవయస్సు, సైన్యంలో చేరిన‌ అద్భుతమైన క్ష‌ణాల నుండి అతను అమరవీరులైన ముంబై దాడి యొక్క విషాద సంఘటనల వరకు అతని జీవితంలోని విభిన్న కోణాలను ఈ మేజ‌ర్ చిత్రంలో చూపించనున్నారు.

పోషిస్తున్న అడివిశేష్ తన పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం ప్రారంభించారు. తాజ్ మహల్ ప్యాలెస్‌లో సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో పాటు 26/11 ముంబై దాడుల‌లో అమరవీరులను అడివి శేష్ గుర్తు చేసుకున్నారు. నమ్మశక్యం కాని విన్యాసాలుల‌తో పాటు, సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయిన అడవి శేష్ ఈ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన మేజ‌ర్ టీజ‌ర్‌కి విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ ఇతర ప్రముఖ పాత్రల్లో నటించారు.  ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు మలయాళంలో విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్ చిత్రం ఫిబ్రవరి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..