Tollywood: జిమ్‌లో కష్టపడుతోన్న ఈ ఫిట్‌నెస్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? నందమూరి హీరోతో తొలి చిత్రం..
ప్రస్తుతం హీరోయిన్లు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఏం చేసినా సరే.. అవి క్షణాల్లో ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు..
ప్రస్తుతం హీరోయిన్లు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఏం చేసినా సరే.. అవి క్షణాల్లో ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు. జిమ్‌లో కసరత్తులు, షూటింగ్ స్పాట్‌లో అల్లరి, విదేశాల్లో షికార్లు.. ఇలా అన్ని మూమెంట్స్‌ను ఫోటోల రూపంలో తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ కాగా.. తాజాగా ఓ హీరోయిన్ జిమ్‌లో కష్టపడుతోన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పైన ఫోటో చూశారు కదా.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. జిమ్‌లో శరీరాన్ని విల్లులా వంచుతున్న ఈ సొగసరి తెలుగులో చేసింది ఒక్క చిత్రమే.
నందమూరి హీరో సరసన నటించి.. తన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ భామ మాత్రం కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. అక్కడ కేజీఎఫ్ స్టార్ యశ్ సరసన కూడా నటించింది. వరుసగా సూపర్ హిట్స్‌ను బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. గుర్తొచ్చిందా..? ఆ హీరోయిన్ ఎవరో..? లేదా మమ్మల్ని చెప్పేయమంటారా.. ఆమె మరెవరో కాదు.. అషిక రంగనాధ్. తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘అమిగోస్’ అనే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక కన్నడంలో అషిక తొలి సినిమా ‘క్రేజీ బాయ్’ కాగా.. ఆ తర్వాత ‘రాంబో 2’, ‘మదగజ’, ‘అవతార పురుష’ , ‘రెమో’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ‘O2’, ‘గతవైభవ’ చిత్రాలు ఉన్నాయి. అటు తెలుగులోనూ ఈ అమ్మడికి పలు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram