Naga Chaitanya: అక్కినేని కుర్ర హీరో సినిమాకు వాయిదా తప్పదా.. థ్యాంక్యూ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. గతేడాది శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫాంలోకి వచ్చాడు చై..

Naga Chaitanya: అక్కినేని కుర్ర హీరో సినిమాకు వాయిదా తప్పదా.. థ్యాంక్యూ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 23, 2022 | 9:38 AM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. గతేడాది శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫాంలోకి వచ్చాడు చై.. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అక్కినేని నాగార్జున, చైతూ కలిసి నటించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలకపాత్రలలో నటించారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సిక్వెల్‏గా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం చైతూ.. థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో  చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. అంతే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా చైతన్య కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య కు జోడీగా బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా నటిస్తుంది.

ఇక ఈ సినిమాను జులైలో రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసారు. అయితే జులై లో వరుస సినిమాలు లైన్ లో ఉండటంతో ఆలోచనలో పడ్డారు థ్యాంక్యూ మేకర్స్. జులై 1న గోపీచంద్ `పక్కా కమర్శియల్`.. 8న నితిన్ `మాచర్ల నియోజక వర్గం`.. 22న నిఖిల్ `కార్తికేయ -2`..28న సుదీప్ `విక్రాంత్ రోనా సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాంతో థ్యాంక్యూ సినిమాను మే కు షిట్ చేశారు. కానీ మే లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కానుంది. దాంతో నాగచైతన్య సినిమాకు థియేటర్స్ దొరకడం కష్టమే. థాంక్యూ` ఆగస్టు ..సెప్టెంబర్ వరకూ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి :  

Aamna Sharif: అందాలతో ఫ్యాన్స్ హృదయాలను లాక్ చేస్తున్న ఆమ్నా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Meenakshi Chaudhary:పింక్ శారీ లో పిచ్చెకిస్తున్న మీనాక్షి.. ఇంత అందానికి ఫిదా కానీ వారుంటారా

Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్.. రేపు యూసఫ్ గూడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..