Sarkaru Vaari Paata: మహేష్ ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్.. అదరగొట్టిన తమన్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. గీతగోవిందం లాంటి సూపర్ హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మహేష్ సరసన అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. మొదటిగా రిలీజ్ అయిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది, తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన మొదటి సింగిల్ ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఆతర్వాత వచ్చిన పెన్నీ సాంగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
తమన్ మరోసారి తన స్టామినాను ఈ పాటతో ప్రూవ్ చేశారు. ఈ పాట వింటుంటే సినిమాకు తమన్ సంగీతం వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలుస్తుందని అర్ధమవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కావాల్సినంత కామెడీ కూడా ఉండనుంది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :