Shruti Haasan: వరుస సినిమాలతో దూసుకుపోతోన్న శ్రుతిహాసన్.. ఇప్పుడు నేచురల్ స్టార్ మూవీలో..
కథ నచ్చితే చాలు ఏ కారెక్టర్ అయినా ఓకే అనేస్తున్నారు. తాజాగా ఈమె ఖాతాలో మరో క్రేజీ సినిమా చేరిపోయింది. కొన్నేళ్లుగా శ్రుతిహాసన్ తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈమె ఉన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

సాధారణంగా ఓ సినిమా ఓకే చేయడానికి స్టార్ హీరోయిన్లు చాలా లెక్కలేసుకుంటుంటారు. తన పాత్ర బాగుండాలి.. లేదంటే పారితోషికం బాగుండాలనుకుంటారు. కానీ శ్రుతిహాసన్ మాత్రం చాలా డిఫెరెంట్. అసలు ఈమె ఏ ప్రాతిపదికన సినిమాలు ఓకే చేస్తున్నారో అర్థం కావట్లేదు. కథ నచ్చితే చాలు ఏ కారెక్టర్ అయినా ఓకే అనేస్తున్నారు. తాజాగా ఈమె ఖాతాలో మరో క్రేజీ సినిమా చేరిపోయింది. కొన్నేళ్లుగా శ్రుతిహాసన్ తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈమె ఉన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సినిమాలో ఈమె ఎంతసేపు కనిపించారు.. కథలో కీలకంగా ఉన్నారా లేదా కాదు.. శ్రుతిహాసన్ ఉంటే బొమ్మ హిట్ అయిపోతుంది. క్రాక్ నుంచి ఇదే జరుగుతుంది. వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలతో జోరు మీదున్న శ్రుతిహాసన్ కు మరో ఆఫర్ పలకరించింది.
శ్రుతిహాసన్ ప్రస్తుతం తెలుగులో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇప్పటికే శ్రుతిహాసన్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మరే తెలుగు సినిమా ఓకే చేయని ఈ బ్యూటీ.. తాజాగా నాని సినిమాకు సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కొత్త దర్శకుడు శౌర్యు తెరకెక్కిస్తున్న నాని 30లో శ్రుతిహాసన్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
నాని 30లో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా నాని 30 వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. 40 రోజుల లాంగ్ షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్‌లోనే శ్రుతిహాసన్ జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో నాని భార్యగా శ్రుతిహాసన్ కనిపిస్తున్నారని.. చిన్నదే అయినా కీలకమైన పాత్ర అని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ కుర్ర హీరోలతో కలిసి నటించారు శృతి హాసన్. ఓ వైపు చిరు, బాలయ్య లాంటి సీనియర్స్‌తో పాటు.. ప్రభాస్, పవన్ లాంటి స్టార్స్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు శ్రుతిహాసన్. మరోవైపు నాని, నాగ చైతన్య లాంటి యంగ్ జనరేషన్‌తోనూ జోడీ కడుతూ ఆల్ రౌండర్ అనిపిస్తున్నారు ఈ బ్యూటీ. అన్నట్లు ‘ది ఐ’ అనే సినిమాతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నారు శ్రుతిహాసన్.




