AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: హీరోగా ఓకే.. మరి ప్రొడ్యూసర్‌గా మాస్ రాజా సక్సెస్ అయ్యేది ఇంకెప్పుడో..

తాజాగా రావణాసుర విషయంలోనే అదే సీన్ రిపీట్ అయ్యింది. రవితేజ ఎంతో నమ్మి, రిస్క్‌ చేసి చేసిన సినిమా రావణాసుర. చాలా కాలం తరువాత మాస్ మహరాజ్‌ గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో నటించటంతో రిలీజ్‌కు ముందు ఈ మూవీ మీద మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. కానీ ఆఫ్టర్ రిలీజ్‌ సీన్‌ రివర్స్ అయ్యింది.

Ravi Teja: హీరోగా ఓకే.. మరి ప్రొడ్యూసర్‌గా మాస్ రాజా సక్సెస్ అయ్యేది ఇంకెప్పుడో..
Raviteja
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2023 | 9:34 AM

Share

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోగా ఎదిగిన నటుడు రవితేజ. హీరోగా ఫుల్‌గా ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ హీరో నిర్మాతగా మాత్రం సక్సెస్ చూడలేకపోతున్నారు. తాజాగా రావణాసుర విషయంలోనే అదే సీన్ రిపీట్ అయ్యింది. రవితేజ ఎంతో నమ్మి, రిస్క్‌ చేసి చేసిన సినిమా రావణాసుర. చాలా కాలం తరువాత మాస్ మహరాజ్‌ గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో నటించటంతో రిలీజ్‌కు ముందు ఈ మూవీ మీద మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. కానీ ఆఫ్టర్ రిలీజ్‌ సీన్‌ రివర్స్ అయ్యింది. రావణాసుర కూడా రొటీన్‌ రివేంజ్‌ డ్రామా అంటూ రిజెక్ట్ చేశారు ఆడియన్స్‌. దీంతో హీరోగానే కాదు, నిర్మాతగానూ రవితేజ ఖాతాలో మరో ఫెయిల్యూర్ యాడ్ అయ్యింది.

గతంలోనూ రవితేజ నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలు అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాను కూడా ఎంతో ఇష్టపడి ప్రొడ్యూసర్ చేశారు రవితేజ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్‌లో పెర్ఫామ్ చేయలేదు. తాను హీరోగా తెరకెక్కే సినిమాలు మాత్రమే కాదు, కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ హీరోగా చేస్తున్న సినిమాలకు కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు మాస్ మహరాజ్‌.

ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యాయి. దీంతో రవితేజకు ప్రొడక్షన్ హౌస్‌ అస్సలు కలిసరావటం లేదంటున్నారు విశ్లేషకులు. మరి ఈ ఎక్స్‌పీరియన్సుల తరువాతైన రవితేజ ప్రొడక్షన్‌ ప్లాన్స్‌ను విరమించుకుంటారా..? లేదంటే మరోసారి పట్టు వదలని విక్రమార్కుడిలా సొంత బ్యానర్‌లో సినిమాలు చేస్తారా..? చూడాలి.

Follow Us
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు