AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి ఆ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన నాని.. ముచ్చటగా మూడోసారి ఆ బ్యూటీతో

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు నాని. ఇటీవలే కోర్ట్ సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

మరోసారి ఆ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన నాని.. ముచ్చటగా మూడోసారి ఆ బ్యూటీతో
Nani
Rajeev Rayala
|

Updated on: Oct 29, 2025 | 1:10 PM

Share

న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్, అమ్మాయిల ఫ్యాన్స్ గురించి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా ఇష్టమైన హీరో. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసిన నాని అనుకోకుండా హీరోగా మారాడు. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నాని. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో తన క్రేజ్ ను మరింత పెంచుకోనున్నాడు. ప్రస్తుతం నాని రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. అలాగే మరో సినిమా కూడా చేయనున్నాడు.

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

ఇదిలా ఉంటే త్వరలో నాని మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. శేఖర్ కమ్ముల. ఇటీవలే శేఖర్ ధనుష్ హీరోగా కుబేర అనే సినిమా చేశాడు. ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయం సాధించాడు. ఇక ఇప్పుడు నానితో ఆయన ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కథను రెడీ చేసే పనిలో ఉన్నాడట శేఖర్ కమ్ముల.

ఇవి కూడా చదవండి

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే సాయి పల్లవి నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమా చేసింది. ఈ సినిమా మత్యకారుల జీవిత కథతో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా చేస్తుంది సాయి పల్లవి. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల, నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని టాక్. నాని, సాయి పల్లవి కలిసి ఎమ్.సీ.ఏ, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..