AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా మొత్తం స్టార్లే.. రూ.85 కోట్లు పెట్టి తీశారు.. రూ.30కోట్లు కూడా రాలేదు..

థియేటర్స్ లో వారం వారం కొత్త కొత్త సినిమాలు విడుదలై పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న చిన్న సినిమాల దగ్గర నుంచి భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి.

సినిమా మొత్తం స్టార్లే.. రూ.85 కోట్లు పెట్టి తీశారు.. రూ.30కోట్లు కూడా రాలేదు..
Movie
Rajeev Rayala
|

Updated on: Oct 29, 2025 | 11:03 AM

Share

కొన్ని సినిమాలు థియేటర్స్‌లో సంచలన విజయం సాధిస్తూ.. నయా రికార్డ్ క్రియేట్ చేస్తుంటాయి. కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై అనుకున్నట్టుగానే విజయం సాధిస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య కొన్ని సినిమా థియేటర్స్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నప్పటికీ సినిమా థియేటర్స్ దగ్గరకు రాగానే డిజాస్టర్ అవుతుంటాయి. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని లేదు అందరి సినిమాలు హిట్స్ అవుతున్నాయి.. అలాగే డిజాస్టర్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం భారీ అంచనాలు, సినిమా మొత్తం స్టార్సే , బడ్జెట్ కూడా ఎక్కువే.. కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇండస్ట్రీ కూడా షాక్ అయ్యింది. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే..

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ అవుతున్నాయి.. కొన్ని డిజాస్టర్స్ అవుతున్నాయి. వాటిలో సఫారీ సినిమా ఒకటి.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాల పరంగా ఈ మధ్యన వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. అలా వచ్చిన వాటిలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సర్ఫిరా’ విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను రాబట్టింది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

సుధా కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్ఫిరా’. కాగా ఇది తమిళ చిత్రం ‘సురారై పోట్రు’ (తెలుగులో ఆకాశమే హద్దురా)కి హిందీ రీమేక్‌. ఆ తమిళ సినిమా గతంలో హిందీలోకి డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మళ్లీ హిందీలో రీమేక్ చేయడంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇప్పటికే ఈ సినిమా కథ అందరికి తెలిసిపోవడంతో ‘సర్ఫిరా’ సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపించలేదు. ఈ సినిమాను రూ.85 కోట్లు పెట్టి తీశారు. కానీ ఇండియాలో రూ.22.13 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.30.02 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కెప్టెన్ గోపీనాథ్ పాత్రను అక్షయ్ కుమార్ పోషించాడు. పరేష్ రావల్, దిశా మదన్, ప్రకాష్ బెలవాడి తదితరులు నటించారు. కోలీవుడ్ నటుడు సూర్య అతిథి పాత్రలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..