Ram Charan-Prabhas: మెగా పవర్ స్టార్ వర్సెస్ పాన్ ఇండియా స్టార్.. ఈసారి సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు..
ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బరిలోకి దిగాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోవడంతో ఇద్దరు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.

ఈ ఏడాది సంక్రాంతికి ఇద్దరు బడా స్టార్ హీరోల మధ్య గట్టి పోటీజరిగిన విషయం తెలిసిందే. సంక్రాంతి అంటే సినిమా సీజన్ అనే చెప్పాలి. స్టార్ హీరోలంతా తమ సినిమాలను సంక్రాంతి పండగకు విడుదల చేయాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మెగా స్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బరిలోకి దిగాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోవడంతో ఇద్దరు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి ఇద్దరు స్టార్స్ పోటీకి రెడీ అవుతున్నారు. ఆ స్టార్ హీరోలు ఎవరంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.
రామ్ చరణ్ , ప్రభాస్ సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 12 జనవరి 2024 తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇక ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చుస్తున్నారట. ఈ సినిమాను నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు. ఈ మూవీని 12 జనవరి 2024 న రిలీజ్ చేయనున్నాం అని డేట్ కూడా లాక్ చేసేసారు. ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు నెక్స్ట్ సంక్రాంతికి రెడీ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. చూడాలి మరి ఎం జరుగుతుందో..




