Nani : నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్‌గా ఆ స్టార్ హీరోయిన్..?
మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ గురించి ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. చివరిగా దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాని. మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిన దసరా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ గురించి ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
హాయ్ నాన్న మూవీ ట్రైలర్ సినిమా పై విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాని లైనప్ చేసిన సినిమాలు ప్రేక్షులను ఆకట్టుకుంటున్నాయి. హాయ్ నాన్న సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికి అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
అలాగే సిబి చక్రవర్తి అనే దర్శకుడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో శివ కార్తికేయన్ తో డాన్ అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు నానితో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో నానికి జోడీగాపూజ హెగ్డే నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం పూజాహెగ్డే సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది. మరి ఇప్పుడు నాని సినిమాలో హీరోయిన్ గా చేస్తుందన్న టాక్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
పూజా హెగ్డే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.