Bigg Boss 7 Telugu: పిచ్చిపిచ్చిగా తిట్టుకున్న సీరియల్ బ్యాచ్.. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అంటూ..
ఈవారం నామినేషన్స్ లో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ, యావర్, ప్రశాంత్ ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ గరం గరం గా జరిగాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఫన్నీ టాస్క్ లు ఇచ్చాడు. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం సీరియల్ బ్యాచ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అమర్, శోభా, ప్రియాంక తిట్టుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. ఈవారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. అర్జున్ ఫినాలే టికెట్ గెలుచుకోవడంతో అతను నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. దాంతో ఇక ఈవారం నామినేషన్స్ లో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ, యావర్, ప్రశాంత్ ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ గరం గరం గా జరిగాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు ఫన్నీ టాస్క్ లు ఇచ్చాడు. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం సీరియల్ బ్యాచ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అమర్, శోభా, ప్రియాంక తిట్టుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అమర్- ప్రియాంక పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ లోగా అక్కడికి శోభా ఓ టెడ్జీ బేర్ తో వచ్చింది.
శోభా సరదాగా అమర్ అంకుల్ అంటూ .. ఫన్ చేయడానికి ట్రై చేసింది. శోభా తన టెడ్డీతో అమర్‌ని కొట్టింది. దాంతో అమర్ ఆ బొమ్మను కాలుతో తన్నాడు. దాంతో ఏంట్రా కాలుతో తన్నుతున్నావ్ అంటూ..అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఆతర్వాత ప్రియాంకని అమర్ సరదాగా పిడికిలితో గుద్దాడు.. ప్రియాంకా కూడా బొమ్మతో అమర్ ను కొట్టింది.
అమర్.. ప్రియాంక ఒడిలో ఉన్న బొమ్మన పట్టుకొని విసిరిపడేసి.. తగులుతుంది.. పిచ్చా ఏమైనా మీకు.. మూతి మీద కొడతారేంటి.. ముక్కు మీద జోకా.. అంటూ సీరియస్ అయ్యాడు అమర్ దీప్. దాంతో ఈ ముగ్గురి మధ్య గొడవ గట్టిగానే జరిగింది. వాళ్లు చేస్తే ఓకే మనం చేస్తే ఓకే కాదు.. నన్ను కొట్టాడు కదా ముందు.. మరి నేను కొడితే ఏంటి.. అంటూ ప్రియాంక శోభాతో చెప్పింది ప్రియాంక. ఆతర్వాత అమర్ వచ్చి వీళ్ల మధ్యలో కూర్చోబోతే.. ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్లకే అంత ఉన్నప్పుడు నాకేంటి.. కాళ్లు పట్టుకోవాలా ఏంటి.. అని అమర్ అంటే నీకు ఎందుకంత..అంటూ పర్ ఇయంకా అరిచింది. ఏమన్నాను నేను.. ప్రతి దానికి అలిగి పోతా ఉంటే ఏంటి అర్థం..నువ్వు అలిగి వెళ్లిపోవచ్చు.. మేము అలగకూడదా.. అని ప్రియాంకా అరిచింది. బొమ్మని విసిరినందుకు కూడా మాట్లాడకుండా ఉంటారు.. బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేదు అని అమర్ సీరియస్ అయ్యాడు. నువ్వు మనసులో ఏదో ఇరిటేషన్ పెట్టుకొని మాతో అలా మాట్లాడకు..అంతేలే ఎవరి కోసం ఎంత చేసినా జీరో .. ఛీ.. అని ప్రియాంక అంది. ఆ తర్వాత అమర్ ప్రియాంక దగ్గర కూర్చుందామని ట్రై చేశాడు. నేను చేసిన దానికి నీకు 140 పాయింట్లు ఇప్పిచ్చిన దానికి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి..అని డైలాగ్ కొట్టింది ప్రియాంక..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



