Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు పూనకాలే..! మహేష్‌లానే పవన్ కళ్యాణ్ కూడా.. ఓజీలో ఆ సన్నివేశాలు..

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ సినిమాలతో రానున్నారు పవన్

ఫ్యాన్స్‌కు పూనకాలే..! మహేష్‌లానే పవన్ కళ్యాణ్ కూడా.. ఓజీలో ఆ సన్నివేశాలు..
Mahesh Babu, Pawankalyan
Rajeev Rayala
|

Updated on: May 24, 2025 | 10:17 AM

Share

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పటివరకూ పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. అయినా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ పాన్ ఇండియా సినిమాలతో రానున్నారు. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి సంచలన విజయం తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ గ్లోబల్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు రాజమోళి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తమ అభిమానులకు పూనకాలు తెప్పించే సన్నివేశాల్లో నటిస్తున్నారని తెలుస్తుంది. అదేంటంటే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు షర్ట్ లెస్ ఫైట్ ఉండనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

మహేష్ బాబుతో రాజమౌళి ఓ అదిరిపోయే షర్ట్ లెస్ ఫిట్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమాలో షర్ట్ లెస్ ఫైట్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమాలో సుజిత్ ఓ అదిరిపోయే ఫైట్ సీన్ ను ప్లాన్ చేశాడట. ఈ ఫైట్ లో పవన్ షర్ట్ లేకుండా కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ.. ఇదే నిజమైతే మహేష్, పవన్ అభిమానులు థియేటర్స్ లో పూనకాలతో ఊగిపోతారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.