AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా అద్భుతం..!! తన్మయత్వంతో శివయ్య ముందు నెమలిలా నాట్యం.. ఈ తెలుగమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న తెలుగమ్మాయిల్లో ఈ చిన్నది ఒకరు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ.. హీరోయిన్ గా ఒకొక్క మెట్టు ఎక్కుతుంది ఈ చిన్నది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఆహా అద్భుతం..!! తన్మయత్వంతో శివయ్య ముందు నెమలిలా నాట్యం.. ఈ తెలుగమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: May 24, 2025 | 9:38 AM

Share

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు చాలా వరకు తక్కువ ఉంటున్నాయి. దాంతో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రకరకాల ఫోటో షూట్స్, వీడియోలతో అభిమానులను కవ్విస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి గుర్తుంపు తెచ్చుకుంటుంది ఈ చిన్నది విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ చిన్నది.. తాజాగా శివలింగం దగ్గర నెమలిలా నాట్యం చేసింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తన అందంతో పాటు నటనతోనూ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

ఇండస్ట్రీలో రాణిస్తున్న తెలుగమ్మాయిల్లో ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యకంగా చెప్పుకోవాలి.. నటిగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ వస్తుంది ఈ చిన్నది. ఆమె ఎవరో కాదు అనన్య నాగళ్ల. సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోయిన్స్  చిత్రాల్లోనూ మెప్పిస్తోందీ ఈ చిన్నది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అనన్య గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అనన్య శివ లింగం దగ్గర నాట్యం చేస్తూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నేను ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ని కాదు.. కాబట్టి ఏవైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో అనన్య నాట్యం, ఆమె హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. అనన్య డాన్స్ పై ప్రశంసలు కురిపిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!