Manchu Manoj: కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.? అప్డేట్ ఎప్పుడంటే

హీరోగా మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు తేజ. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత సోలో హీరోగా జంబిరెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Manchu Manoj: కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.? అప్డేట్ ఎప్పుడంటే
Manchu Manoj
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 19, 2024 | 8:42 AM

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు కుర్ర హీరో తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు తేజ సజ్జ.. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు తేజ. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత సోలో హీరోగా జంబిరెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రీసెంట్ గా మరోసారి ప్రశాంత్ వర్మతో కలిసి హనుమాన్ సినిమా చేశాడు తేజ. హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో  అవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.

పాన్ ఇండియా వైడ్ గా హనుమాన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు తేజ మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గురువారం రోజున ఈ సినిమా టైటిల్ తో పాటు తేజ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానుందని అర్ధమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, రితిక నాయక్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఆయన లుక్ తో పాటు క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే ఈ సినిమాలో మనోజ్ సెకండ్ హీరోగా కనిపిస్తారా.? లేక విలన్ గా నటిస్తున్నారా.? అన్నది తెలియాల్సి ఉంది. మే 20న మనోజ్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు దీని పై క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు మూవీ టీమ్. మనోజ్ ఇప్పుడు రీ ఎంట్రీతో అదరగొట్టడానికి రెడీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను  లైనప్ చేసి సిద్ధంగా ఉన్నారు మనోజ్. ఇక మిరాయ్ చిత్రాన్ని ఏప్రిల్ 18, 2025 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాను 2 డి, 3డి లో రిలీజ్ కానుంది.

మంచు మనోజ్ ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.