AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: బాబు డెడికేషన్ మాములుగా ఉండదు..! జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

గుంటూరు కారం సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ భారీగా పెరిగిపోయింది.

Mahesh Babu: బాబు డెడికేషన్ మాములుగా ఉండదు..! జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2024 | 7:53 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఓ భారీ హిట్ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నటించిన సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ఆవి ఫ్యాన్స్ కు అంతగా కిక్ ఇవ్వలేకపోతున్నాయి. దాంతో ఒక్క సాలిడ్ హిట్ పడాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. గుంటూరు కారం సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ భారీగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అన్నారు. ఇప్పటికే కథ పూర్తయ్యిందని.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని అన్నారు.

ఇక ఈ సినిమా గురించి త్వరలోనే ఓ కాన్సెప్ట్ వీడియో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మహేష్ కనిపిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్స్ లో ఉన్నారు. విదేశాల్లో ఉన్న మహేష్ ప్రస్తుతం స్కెటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాలో ఈ సీక్వెన్స్ కోసం మహేష్ బాబు స్కెటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే మహేష్ ఇండియాకు తిరిగి రానున్నారు. మరి రాజమౌళి మహేష్ బాబు సినిమాతో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!