Balakrishna: నటసింహం 109ను డైరెక్ట్ చేసేది అతడేనట.. అయితే ఆ కండీషన్ తప్పదట

ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. కొద్ది రోజులుగా చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు అనిల్. ఇందులో బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది.

Balakrishna: నటసింహం 109ను డైరెక్ట్ చేసేది అతడేనట.. అయితే ఆ కండీషన్ తప్పదట
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2023 | 3:58 PM

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఇప్పటికే ఆకాండ సినిమాతో సంచలనం సృష్టించిన బాలయ్య.. రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. కొద్ది రోజులుగా చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు అనిల్. ఇందులో బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా పక్కా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే ఇందులో బాలయ్య చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉంది. ఆయన బర్త్ డే కానుకగా అదిరే ట్రీట్స్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎన్బీకే 108 నుంచి సాలీడ్ అప్డేట్ అందించారు మేకర్స్. అన్న దిగుతుండు.. ఎన్బీకే బర్త్ డే మాములుగా ఉండదు అంటూ రాసుకొచ్చింది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే బాలయ్య 109 ఎవరితో అన్నదాని పై ఆసక్తి నెలకొంది. అయితే బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు లైన్ లోకి బాబీ వచ్చాడు. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న బాబీ. . ఇప్పుడు బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను 90 రోజుల్లో పూర్తి చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. 2024లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా చేయాలని చూస్తున్నారట.