Aa Naluguru: రాజేంద్ర ప్రసాద్ ఆ నలుగురు సినిమా మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..

ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు ఈ వర్సటైల్ యాక్టర్. ఇక రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఆ నలుగురు సినిమా ఒకటి. 2004లో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.

Aa Naluguru: రాజేంద్ర ప్రసాద్ ఆ నలుగురు సినిమా మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..
Aa Naluguru
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2023 | 3:31 PM

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పత్రాలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వయసు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు రాజేంద్రప్రసాద్. ఒకప్పుడు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు ఈ వర్సటైల్ యాక్టర్. ఇక రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఆ నలుగురు సినిమా ఒకటి. 2004లో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సుత్తివేలు, ఆమని, కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, రాజా కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమాలో ముందుగా హీరోగా మరో సీనియర్ నటుడిని అనుకున్నారట ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ. దర్శకుడు ముందుగా ఈ సినిమా కథను కృష్ణకు చెప్పగా ఆయనకు ఎంతో నచ్చి సినిమా చేద్దాం అనుకున్నారట. అయితే వయసు రీత్యా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించేంత శక్తి లేదని చెప్పారట.

దాంతో ఆ కథ రాజేంద్రప్రసాద్ చేతికి వచ్చిందట. అలాగే ఈ మూవీలో హీరోయిన్ కోసం కూడా చాలా మందిని సంప్రదించారట లక్ష్మి, గౌతమి, భానుప్రియ, రోజా, సుహాసిని ఇలా పలువురిని సంప్రదించారట. కానీ అందరు బిజీగా ఉండటంతో చివరకు రాజేంద్ర ప్రసాద్ సలహా మేరకు అమానిని ఓకే చేశారట. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో ఆ నలుగురు సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలిచింది.Krishna

Krishna