AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు మరో సీనియర్ హీరోకు జోడీగా యంగ్ బ్యూటీ..

కుర్ర హీరోలకంటే సీనియర్ హీరోలే యమా స్పీడ్ మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైనప్ చేస్తున్నారు. ఇక సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి యంగ్ హీరోయిన్స్ కాస్త వెనకడుగు వేస్తారు. కానీ ఈ భామ మాత్రం వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లోనే నటిస్తుంది.

చిరంజీవి, నాగార్జున తర్వాత ఇప్పుడు మరో సీనియర్ హీరోకు జోడీగా యంగ్ బ్యూటీ..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 04, 2025 | 4:48 PM

Share

కుర్ర హీరోలతో పోటీపడుతూ సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తున్నారు సీనియర్ హీరోలు.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలాంటి సీనియర్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు. అయితే సీనియర్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్స్ దొరకడం ఒకింత కష్టమే.. యంగ్ బ్యూటీ సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఆలోచిస్తారు.. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే మెగాస్టార్, నాగార్జునలాంటి హీరోలతో చేసింది ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.?

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్. మంచి అంచనాల నడుమ విడుదలైన అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సినిమాలో నటించింది. ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత ఇప్పుడు ఈ ముద్దగుమ్మ ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

విశ్వంభర షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలో ఆషిక రంగనాథ్‌ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్‌ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత