Prabhas: ప్రభాస్ సినిమాలో మరో హాట్ బ్యూటీ.. హనురాఘవపూడి మూవీలో ఆ పాన్ ఇండియా హీరోయిన్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్, కల్కి హిట్స్ తర్వాత ప్రభాస్ సినిమాల పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, కల్కి 2, హనురాఘపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ ఇప్పట్లో ఆగేలా లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే పనిలో ఉన్నాడు సలార్, కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, కల్కి 2, హనురాఘపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మణిరత్నం స్టైల్ లో సినిమా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించాడు.
ఆతర్వాత నాని హీరోగా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, నితిన్ తో లై , శర్వానంద్ హీరోగా పడి పడి లేచె మనసు సినిమాలు చేశాడు. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కించిన సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు హనురాఘవపూడి. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది. ఈ సినిమాకు పౌజి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వీ నటిస్తుంది. ఇమాన్వీ మొన్నటివరకు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆమె ఫెమస్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఈ మూవీలో స్టార్ బ్యూటీ అలియా భట్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. పౌజి సినిమాలో మహారాణి పాత్రలో అలియా భట్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అలియా భట్ తో సంప్రదింపులు కూడా జరిగాయని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి