Upendra ‘A ‘: ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్.. ఉపేంద్ర క్రేజీ మూవీ కూడా రాబోతుంది
రీరిలీజ్ అవుతున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలను కూడా రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన బిగెస్ట్ బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాతో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి రికార్డులు కూడా క్రియేట్ చేశాయి.

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ తెగ సందడి చేస్తుంది. అదే రీ రిలీజ్ లు.. ఒకప్పుడు హిట్ గా నిలిచిన సినిమాలు ఇప్పుడు రీరిలీజ్ అవుతున్నాయి. రీరిలీజ్ అవుతున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలను కూడా రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన బిగెస్ట్ బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాతో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి రికార్డులు కూడా క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా రిలీజ్ అయినా ఓయ్ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో క్రేజీ మూవీ రీ రిలీజ్ కానుంది. ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ఆ సినిమా ఏంటో తెలుసా..?
కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్రకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథనంతో తెరకెక్కిన ఉపేంద్ర సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘A’. ఉపేంద్ర, చాందినీ జోడిగా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 1998లో విడుదలైంది ఈ సినిమా ముందుగా కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆతర్వాత తెలుగులో రిలీజ్ అయ్యింది.
కేవలం కోటిన్నర తో తెరకెక్కిన ఈ సినిమా 20కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ‘A’ సినిమాకు కథ, దర్శకత్వం మొత్తం ఉపేంద్రనే అందించారు. ఇండియన్ సినిమాల్లో రివర్స్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా నిలిచింది ఉపేంద్ర ‘A’. ఇక ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కానుందని తెలిసి అభిమానులు ఖుష్ అవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ రీ రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఉపేంద్ర ట్విట్టర్ పోస్ట్..
Something unexpected is coming your way ❤️#UITheMovie1stSingle launching at @YouTube Mumbai Headquarters on March 4th at 12:00 PM 🔥#UppiDirects @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth #NaveenManoharan @AJANEESHB @shivakumarart @Reeshmananaiah… pic.twitter.com/wIESXpJdCh
— Upendra (@nimmaupendra) March 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
