AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monica Song: మోనికా సాంగ్‌లో సూపర్బ్ డ్యాన్స్.. పూజా పాపనే డామినేట్ చేసిన ఈ నటుడెవరో తెలుసా?

పూజా హెగ్డే మోనికా సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలోని బుట్ట బొమ్మ నటించిన మై డియర్ మోనికా సాంగ్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా పూజా పాపను మించి ఓ నటుడు చేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు.

Monica Song: మోనికా సాంగ్‌లో సూపర్బ్ డ్యాన్స్.. పూజా పాపనే డామినేట్ చేసిన ఈ నటుడెవరో తెలుసా?
Monica Song
Basha Shek
|

Updated on: Jul 13, 2025 | 5:22 PM

Share

కోలీవుడ్ సూపర్ స్టార్ నటించిన తాజా చిత్రం కూలి. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మోనికా’ అనే సాంగ్ రిలీజైంది. ఈ పాటలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన సూపర్బ్ డ్యాన్స్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. పూజతో పాటు మోనికా సాంగ్ కూడా ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. అయితే పూజా హెగ్డే కంటే ఇదే పాటలో ఆమెతో కలిసి డ్యాన్స్ చేసిన నటుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అతను పూజను బాగా డామినేట్ చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కపాటతోనే ఇంతలా ఫేమస్ అయిపోయిన అతను మరెవరో కాదు మలయాళ స్టార్ నటుడు సౌబిన్ షాహిర్.

ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసే ఆడియెన్స్ కు సౌబిన్ షాహిర్ గురించి బాగా తెలిసే ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన అతను ఆ తర్వాతి కాలంలో ప్రొడక్షన్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశాడు. కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగానూ వర్క్ చేశాడు. ఇదే సమయంలో నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలు పెట్టాడు. అలా 2018 రిలీజైన ‘సుదాని ఫ్రమ్ నైజీరియా’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సౌబిన్. ఈ సినిమాలో నటనకుగాను కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం అందుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచమ్ తదితర సినిమాలతో మలయాళంలో స్టార్ నటుడిగా మారిపోయాడు సౌబిన్ షాహిర్ . ఇక గతేడాది ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయాడు. ఇదే సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ అందుకున్నాడు సౌబిన్. ఇప్పుడు కూలీ సినిమాతో మరో సారి పాన్ ఇండియా రేంజ్ లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. కాగా  కూలీ సినిమా కోసం దాదాపు 7-8 మూవీస్‌ని వదులుకున్నాడు సౌబిన్ షాహిర్. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీలో అతని పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. మోనికా పాటలో సౌబిన్ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే కంటే ఇతడి డ్యాన్సే బాగుందని కితాబిస్తున్నారు. మరి మూవీ రిలీజ్ తర్వాత సౌబిన్‌కి ఇంకెంత క్రేజ్ వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మోనికా సాంగ్ లో పూజ హెగ్డే, సాబిన్ షౌహిర్ స్టెప్పులు.. ఫుల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!