AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్‌ 8 వరకు సుశాంత్‌తో స‌హ‌జీవ‌నం చేశా : రియా

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ యువ హీరో ఆత్మ‌హ‌త్య‌కు అతడి ప్రియురాలు రియా చక్రవర్తి న‌డ‌వ‌డికే రీజ‌న్ అంటూ బిహార్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

జూన్‌ 8 వరకు సుశాంత్‌తో స‌హ‌జీవ‌నం చేశా : రియా
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2020 | 4:41 PM

Share

Sushant Singh Rajput Death Case : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ యువ హీరో ఆత్మ‌హ‌త్య‌కు అతడి ప్రియురాలు రియా చక్రవర్తి న‌డ‌వ‌డికే రీజ‌న్ అంటూ బిహార్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. రియా తన కుమారుడి నుంచి డబ్బులు గుంజుకోని, మోసం చేసి వెళ్లిపోయిందని సుశాంత్ ఫాద‌ర్ క్రిష్ణ కిషోర్‌ సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిహార్‌ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించగా.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈ కేసు దర్యాప్తును బిహార్‌ నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఆమె పిటిషన్ లో కోరారు.

ఇందులో సుశాంత్‌తో తన రిలేష‌న్, అతడి మ‌ర‌ణం అనంత‌రం జరుగుతున్న పరిణామాల గురించి రియా పిటిషన్‌లో ప్రస్తావించిన విషయాలు సంచ‌ల‌నంగా మారాయి. గత ఏడాది కాలంగా తామిద్దరం డేటింగ్ చేస్తున్న‌ట్లు కోర్టుకు తెలిపిన ఆమె.. జూన్‌ 8న సుశాంత్‌ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌తో బాధ పడుతున్న సుశాంత్‌.. దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు మెడిసిన్ వాడేవాడని వివ‌రించారు. ఈ క్రమంలో జూన్‌ 14న బాంద్రాలోని తన ఇంట్లో అతడు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడ‌ని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆమె వాపోయారు. ప్రియుడి మరణంతో బాధ‌లో ఉన్న‌ తనను కొంత మంది రేప్ చేసి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలియ‌జేశారు.

ఇందుకు సంబంధించి ముంబైలోని శాంతాక్రజ్ పీఎస్ లో కూడా కంప్లైంట్ చేసిన‌ట్టు రియా చెప్పుకొచ్చారు. ఇప్పటికే సుశాంత్ సూసైడ్ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు తన స్టేట్మెంట్ రికార్డు చేశారని, అయినప్పటికీ మరోసారి పాట్నాలో కేసు నమోదు కావడం తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సుశాంత్‌ తండ్రి బిహార్‌లో తన పలుకుబడి ఉపయోగించి కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉన్నందున కేసును మంబైకి బదిలీ చేయాలని కోరారు. కాగా రియాతో బంధం కారణంగానే తన కొడుకు ఒత్తిడిలో కూరుకుపోయాడ‌ని సుశాంత్‌ తండ్రి ఆరోపించిన విషయం తెలిసిందే.

Read More : రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్