Vishwak Sen: ఆ మాటకు ఇంకా కట్టుబడే ఉన్నాను.. సినిమాకు ప్రమోషన్స్‌ కూడా అవసరం లేదంటున్నారు. విశ్వక్‌ సేన్‌ వ్యాఖ్యలు.

Vishwak Sen: 'వెళ్లిపోమాకే' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్. అనంతరం నటించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు...

Vishwak Sen: ఆ మాటకు ఇంకా కట్టుబడే ఉన్నాను.. సినిమాకు ప్రమోషన్స్‌ కూడా అవసరం లేదంటున్నారు. విశ్వక్‌ సేన్‌ వ్యాఖ్యలు.
Vishwak Sen
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 14, 2021 | 10:58 AM

Vishwak Sen: ‘వెళ్లిపోమాకే’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్. అనంతరం నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమాతో తనలోని దర్శకత్వ ప్రతిభను సైతం బయటపెట్టాడు విశ్వక్‌. ఇక ఆయన నటించే సినిమాలతో పాటు కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌లతో సైతం నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు విశ్వక్‌. గతంలో ఫలక్‌నుమా దాస్‌ ప్రీరిలీజ్‌ వేడుకల్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు విశ్వక్‌. ఇక తాజాగా ఈ యంగ్‌ హీరో ‘పాగల్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శనివారం విడుదలైంది.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న విశ్వక్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాగల్‌’ సినిమా విజయం సాధించకపోతే తాను పేరు మార్చుకుంటానంటూ మరోసారి చర్చకు దారి తీశాడు. దీంతో విశ్వక్‌పై కొందరు కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఇంత ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎందుకు? అంత ఆటిట్యూడ్‌ చూపించాల్సిన అవసరం ఏముంది అంటూ సోషల్‌ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం మీడియాతో ముచ్చటించిన విశ్వక్‌ మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉన్నారా.? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ ఈవెంట్లో నేను మాట్లాడిన ఏ మాటనీ వెనక్కి తీసుకోనని చెప్పాడు. తనతో పాటు తన స్నేహితులు కూడా ఈ సినిమా చూశారని, వారందరూ.. ‘నువ్వు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేద’ని అన్నారని విశ్వక్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా పాగల్‌ చిత్రానికి ప్రమోషన్స్‌ కూడా అవసరం లేదని వారు చెబుతున్నారన్నారు. ఇక ఈ సినిమాతో థియేటర్‌లకు పూర్వ వైభవం వస్తుందనే నమ్మకముంది. అదే జరిగితే నటుడిగా అంతకుమించిన సంతృప్తి ఏదీ లేదని చెప్పుకొచ్చాడు విశ్వక్‌. ఇదిలా ఉంటే నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించారు. ఇందులో విశ్వక్‌కు జోడిగా నివేధా పేతురాజు నటించింది.

Also Read: MAA Elections 2021: మా పంచాయితీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌‌‌లో రసవత్తర పరిణామాలు

Thalapathy vijay: దళపతి విజయ్ కోసం పాట రాస్తున్న హీరో.. బీస్ట్ మూవీకోసం రంగంలోకి దిగిన శివకార్తికేయన్..

Megha Akash: ఆ విషయంలో అమ్మ, నాన్నల సలహాలు అస్సలు తీసుకోను నా ఇష్టమే ఫైనల్‌.. మేఘా ఆకాష్‌ .