ఈ బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్‌‌‌లో నెంబర్ వన్ హీరోయిన్.. గెస్ చేయడం కష్టమే.. కావాలంటే ట్రై చేయండి..

సినిమా హీరోయిన్స్ ను కొందరు అభిమానులు దేవతలుగా పూజిస్తుంటారు. అందమైన హీరోయిన్స్ ఫోటోలను ఇంటినిండా అతికించుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్ కు సంబంధించిన

ఈ బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్‌‌‌లో నెంబర్ వన్ హీరోయిన్.. గెస్ చేయడం కష్టమే.. కావాలంటే ట్రై చేయండి..
Anushka
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2021 | 11:01 AM

సినిమా హీరోయిన్స్‌‌‌ను కొందరు అభిమానులు దివినుంచి దిగివచ్చిన దేవతలుగా పూజిస్తుంటారు. అందమైన హీరోయిన్స్ ఫోటోలను ఇంటినిండా అతికించుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరోయిన్‌‌‌కు సంబంధించిన ఫోటోలను ఎంతో పదిలంగా దాచుకుంటూ ఉంటారు. ఈ ఫొటోలో ఉన్న బుజ్జాయి  కూడా అభిమానుల ఆరాధ్య దేవత. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్‌‌‌లోనే నెంబర్ వన్ హీరోయిన్‌‌‌గా కంటిన్యూ అవుతోంది. ఒక్క సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. దాదాపు అందరు హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగు తమిళ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇంతకు ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? పాలుగారే ఈ చిన్నారి ఇప్పుడు పొడుగు కాళ్ళ సుందరి.. ఆమే అందాల అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో హీరోయిన్‌‌‌‌గా పరిచయమైన అనుష్క ఇప్పుడు టాప్ హీరోయిన్‌‌‌గా రాణిస్తుంది. Anushka

కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా బ్యూటీగా మారిపోయింది స్వీటీ. ఇక ప్రయోగాత్మక సినిమాలు చేయడంలోనూ అనుష్క ముందుంటుంది. అరుంధతి, నిశ్శబ్దం వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. వెండితెరపై స్వీటీ అందం, అభినయం చూసి అన్ని భాషా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక అనుష్క పెళ్లి మ్యాటర్ ఎప్పటినుంచో జనం నోళ్ళలో నానుతూనే ఉంది. అనుష్క త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుందంటూ ఎప్పటికప్పుడు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆ మధ్యకాలంలో టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతుందనే కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది కానీ అది కూడా నిజం కాదని తేలిపోయింది. అనుష్క ‘నిశ్శబ్దం’ తర్వాత నెక్స్ట్ సినిమాఅనౌన్స్ చేయలేదు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమాల నుంచి ఆమె కాస్త బ్రేక్ తీసుకుంది.అనుష్క నెక్స్ట్  ప్రాజెక్ట్‌ కోసం అభిమానులు మాత్రం ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలవైపే మగ్గు చూపిస్తున్న అనుష్క.. మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది.Anushka 1

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..

Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌‌‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌‌తో ఇలా డాన్స్‌‌‌లు

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..