AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: మా పంచాయితీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌‌‌లో రసవత్తర పరిణామాలు

'మా'లో లొల్లి చిలిచిలి గాలివానలా తయారయ్యింది. సినిమాను మించి ట్వీట్స్‌‌‌లతో, గొడవలతో నానా రచ్చగా ఉంది' మా'. మైక్ కనిపిస్తే చాలు ఒకరి మీద ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో 'మా'లో లుకలుకలన్నీ బయటపడిపోతున్నాయి.

MAA Elections 2021: మా పంచాయితీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌‌‌లో రసవత్తర పరిణామాలు
Maa
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2021 | 10:06 AM

Share

MAA Elections 2021: ‘మా’లో లొల్లి చిలికి చిలికి గాలివానలా తయారయ్యింది. సినిమాను మించి ట్విస్ట్‌‌‌‌లతో, గొడవలతో నానా రచ్చగా ఉంది’ మా’. మైక్ కనిపిస్తే చాలు ఒకరి మీద ఒకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో ‘మా’లో లుకలుకలన్నీ బయటపడిపోతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. మరో నలుగురిలో హేమ- జీవిత- సీవీఎల్ వంటి వారు రేసులో ఉన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌‌‌‌ను కూడా అనౌన్స్ చేశారు. ఇక నరేష్ వర్గంలోని 100 ఓట్లు కూడా ఈ సారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఎవరు గెలిచినా 2021-24 సీజన్‌‌‌‌‌కి అధ్యక్షుడిగా ‘మా’ను ఏలుతారు. ఇన్నాళ్లు ఏకగ్రీవం అంటూ వినిపించినా.. దానికంటే ఎన్నికలే బెటరనే ఉద్ధేశం పెద్దల్లో బయటపడడంతో.. ఎన్నికల పోరులో ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నటి హేమ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. మా నిధుల దుర్వినియోగానికి గురయ్యాయని ఆమె ఓ వాయిస్ మెసేజ్ ద్వారా ఆరోపించడంతో రచ్చ మొదలైంది. హేమ పై సీనియర్ నరేష్ సీరియస్ అయ్యారు. ఆమె పై క్రమ శిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు. నరేష్‌‌‌తోపాటు జీవిత రాజశేఖర్ కూడా హేమ పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో హేమ చేసిన ఆరోపణలపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది క్రమశిక్షణ సంఘం.

ఇదిలా ఉంటే శనివారం ఫిలిం ఛాంబర్‌‌‌లో కొందరు మా సభ్యులు ప్రెస్ మీట్‌‌‌ను ఏర్పాటు చేశారు. “మా” నిబంధనలను ఉల్లంఘించిన కొందరు మా సభ్యుల పై క్రమ శిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకి పిర్యాదు చేశారు మా సభ్యులు. దాదాపు వందకు పైగా సభ్యుల సంతకాలతో ఫిర్యాదును సిద్ధం చేశారు. అయితే నాలుగురోజుల క్రితమే కృష్ణంరాజుకు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. మా సభ్యులు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలి అంటు లేఖలో చిరంజీవి కోరారు. మా ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించే సభ్యులను ఉపేక్షించ వద్దు అని చిరంజీవి కృష్ణంరాజును కోరారు. మరో వైపు ఈ నెల 22 న మా జనరల్ బాడీ మీటింగ్‌‌‌లో మా ఎలక్షన్స్ తేదీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..

Vishwak Sen: పాగల్ ప్రమోషన్స్‌‌‌తో దుమ్మురేపుతున్న విశ్వక్ సేన్.. యాంకర్‌‌తో ఇలా డాన్స్‌‌‌లు

Lakshya: అదరహో అనిపిస్తున్న అందాల కేతిక.. నాగశౌర్య ‘లక్ష్య’ నుంచి గ్లిమ్స్ విడుదల..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...